Jio Phone 5G: రూ.2500 డౌన్ పేమెంట్ కడితే జియో 5జీ ఫోన్, మరో సంచలనం దిశగా జియో, రిల్ వార్షిక సమావేశంలో జియో 5జీ ఫోన్ గురించి ప్రకటన వెలువడే అవకాశం

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది.భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌పై క్లూ ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.

Jio Phone 5G: రూ.2500 డౌన్ పేమెంట్ కడితే జియో 5జీ ఫోన్, మరో సంచలనం దిశగా జియో, రిల్ వార్షిక సమావేశంలో జియో 5జీ ఫోన్ గురించి ప్రకటన వెలువడే అవకాశం
Mukesh Ambani (Photo Credits: Youtube)

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది.భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌పై క్లూ ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. అయితే సరసమైన ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ వినియోగదారులకు అందించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

గత ఏడాది రిలయన్స్ జియో , గూగుల్ సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు ఆగస్ట్ 29న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ 5 జీస్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయవచ్చని అంచనా.5జీ జియో ఫోన్ ధర సుమారు 12 వేల రూపాయల లోపునే ఉండనుందని సమాచారం.

ఏడాది పొడవునా ప్రతి రోజు 2.5 జీబీ డేటా ఉచితం, జియో నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్, పూర్తి వివరాలు ఇవే..

అలాగే జియో ఫోన్ నెక్స్ట్ మాదిరిగానే, వినియోగదారులు రూ. 2500 డౌన్ పేమెంట్ చేసి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని మార్కెట్‌ వర్గాల్లో వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గతంలో లాగానే ఈఫోన్‌ కొనుగోలు చేసినవారికి అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో పాటు ఇతర బంపర్‌ ఆఫర్లను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు అధికారంగా ప్రకటించేంతవరకు ఆగక తప్పదు.

జియో 5జీ ఫోన్ ఫీచర్లు

6.5 అంగుళాల HD డిస్‌ప్లే

ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 సాక్‌ ప్రాసెసర్‌

4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌

13ఎంపీ ప్రైమరీ సెన్సార్‌+2 ఎంపీ డ్యూయల్ కెమెరా

8ఎంపీ సెల్ఫీ కెమెరా

(The above story first appeared on LatestLY on Aug 16, 2022 05:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).