Aditya L1 Update: సూర్యుడి వైపు విజయవంతంగా దూసుకుపోతున్న ఆదిత్య ఎల్-1, భూకక్ష్యను మరోమారు పెంచిన ఇస్రో, ఈ నెల 10న మూడో కక్ష్య పెంపు విన్యాసం

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు.

Aditya L1 Update: సూర్యుడి వైపు విజయవంతంగా దూసుకుపోతున్న ఆదిత్య ఎల్-1, భూకక్ష్యను మరోమారు పెంచిన ఇస్రో, ఈ నెల 10న మూడో కక్ష్య పెంపు విన్యాసం
Aditya-L1 Mission (Photo-X ISRO)

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు. ఆదివారం తొలిసారి ఉపగ్రహం కక్ష్యను పెంచిన శాస్త్రవేత్తలు రెండోసారి నేటి తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యపెంపు విన్యాసాన్ని చేపట్టారు. ఈ మేరకు ఇస్రో ఎక్స్ చేసింది.

ఈ నెల 10న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మూడో కక్ష్య పెంపు విన్యాసాన్ని చేపడతామని తెలిపింది.నేడు చేపట్టిన విన్యాసం ద్వారా ఆదిత్య ఉపగ్రహం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమించనుంది. బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్‌లోని గ్రౌండ్ స్టేషన్లు ఆదిత్య గమనాన్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

జాబిల్లిపై స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయిన ప్రజ్ఞాన్‌ రోవర్, సెప్టెంబర్ 22 వరకు చీకట్లో చంద్రుడి దక్షిణ ధృవం, సూర్య కాంతి వస్తేనే స్లీప్ మోడ్ నుంచి ఆన్

శనివారం శ్రీహరికోట నుంచి బయలుదేరిన ఆదిత్య ఎల్-1ను హాలో ఆర్బిట్ అయిన లాంగ్రాంజియన్ పాయింట్-1 (ఎల్-1) లో ప్రవేశపెడతారు. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగంలో ఉపగ్రహం సూర్యుడికి సమీపంగా వెళ్లడం కానీ, సూర్యుడి మీద లాండింగ్ కానీ ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం ఆదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపిస్తుంది. ఆ తర్వాత కూడా మరో 10-15 సంవత్సరాల వరకు అది పనిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 05, 2023 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).