Onboard Chandrayaan-2: చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో, అద్భుతంగా పనిచేస్తున్న ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మిస్సయిందనే చింతను వదిలేయవచ్చు, ట్వీట్ చేసిన ఇస్రో

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. అయినా నిరాశపడనవసరం లేదు.

Onboard Chandrayaan-2: చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో, అద్భుతంగా పనిచేస్తున్న ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మిస్సయిందనే చింతను వదిలేయవచ్చు, ట్వీట్ చేసిన ఇస్రో
OHRC onboard chandrayaan-2-orbiter-sends-high-resolution-images-moon (photo-twitter)

Sriharikota,October5: ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. అయినా నిరాశపడనవసరం లేదు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌ ఇప్పుడు అద్భుతమైన ఫొటోలను తీసి పంపుతోంది. ల్యాండర్ తో పాటు చంద్రుని దక్షిణ భాగ ఉపరితలం దగ్గరగా వెళ్లిన ఆర్బిటర్ మాత్రం అద్భుతంగా పనిచేస్తోంది. చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇస్రో చేసిన సాహసోపేత ప్రయత్నం నిరూపయోగం అయిందని భావిస్తున్న తరుణంలో ఆర్బిటల్ కొత్త ఆశలు రేపుతోంది. ఈ మేరకు ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో ట్వీట్‌ చేసింది. ఆర్బిటర్‌లో అమర్చిన ఎంతో కీలకమైన హై రిజల్యూషన్‌ కెమెరా ఈ ఫొటోలు తీసింది. కాగా చంద్రుడి నైసర్గిక స్వరూపం తెలుసుకునేందుకు ఈ ఫొటోలు ఉపయోగపడతాయని ఇస్రో తెలిపింది. ఆర్బిటర్‌ సెప్టెంబరు 5న చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫొటోలను తీసింది. దక్షిణ ధ్రువంలో 14 కిలోమీటర్ల వ్యాసం, 3 కిలోమీటర్ల లోతుతో ఉన్న 'బోగుస్లాస్కై ఈ' బిలాన్ని ఇస్రో గుర్తించింది . ఇందులో 5 మీటర్ల కన్నా తక్కువ వ్యాసమున్న రెండు చిన్న బిలాలను, 1 నుంచి 2 మీటర్ల ఎత్తున బండరాళ్లను ఇస్రో గుర్తించింది.

కొత్త ఆశలు

ఇస్రో పంపిన ఆర్బిటర్ లోని ఆర్బిటర్ హై రెజుల్యుషన్ కెమెరా (OHRC) టూల్ ద్వారా ఈ ఫోటోలను ఆర్బిటర్ తీసి భూకేంద్రానికి పంపుతోంది.ఇస్రో ఎంపిక చేసిన చంద్రుని టాపో గ్రాఫిక్ ప్రాంతాన్ని తన శక్తివంతమైన కెమెరా టూల్ తో HD ఫొటోలను క్యాప్చర్ చేస్తోంది. కాగా సెప్టెంబర్ 7న చంద్రునిపై ల్యాండ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. విక్రమ్ తో కమ్యూనికేషన్ సిస్టమ్ సిగ్నల్స్ కట్ అయ్యాయి. కాగా విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయినట్టుగా ఇస్రో భావిస్తోంది. నాసా రంగంలో దిగి తమ ఆర్బిటర్ సాయంతో ఫొటోలు తీసినా విక్రమ్ ఆచూకీ దొరకలేదు. చివరికి నాసా కూడా చేతులేత్తేసింది.

(The above story first appeared on LatestLY on Oct 05, 2019 03:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).