Supermoon 2022: సూపర్ మూన్ కనిపించేది రేపే, ఆకాశంలో అద్భుతాన్ని చూడాలంటే గురువారం అర్థరాత్రి వరకు మేల్కోవాల్సిందే, సూపర్ మూన్ అంటే ఏమిటో ఓసారి చూద్దాం
జూలై 13న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు ఆషాడ పౌర్ణిమ రోజున చంద్రుడు.. భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. ఈ జులై 13న 'సూపర్‌మూన్' కనువిందు చేయనుంది. దీనిని బక్ సూపర్ మూన్, థండర్ మూన్, హేమూన్, మెడ్ మూన్ అని (Supermoon 2022) కూడా పిలుస్తారు.
జూలై 13న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు ఆషాడ పౌర్ణిమ రోజున చంద్రుడు.. భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. ఈ జులై 13న 'సూపర్‌మూన్' కనువిందు చేయనుంది. దీనిని బక్ సూపర్ మూన్, థండర్ మూన్, హేమూన్, మెడ్ మూన్ అని (Supermoon 2022) కూడా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఈ అద్భుతాన్ని ( Biggest moon) దర్శించుకోనున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకారం.. జులై 13న ఈ సూపర్ మూన్ కనిపించనుంది. మధ్యాహ్నం 2.38 గంటలకు ఆ అద‍్భుతం కనిపించనుందని నాసా తెలిపింది. అయితే.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.08 గంటలకు అంటే జులై 14న ఈసూపర్ మూన్ కనిపించనుంది.
భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన ఈ నిండైన చంద్రుడిని (Moon) మూడు రోజుల పాటు చూడొచ్చు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం తెల్లవారు వరకు చందమామ కనువిందు చేయనున్నాడు. తన కక్షలో తాను తిరుగుతున్న చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ఇలా నిండుగా, అతిపెద్దగా కనిపిస్తాడు. దీనినే సూపర్‌మూన్‌గా పిలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నొల్లే 1979లో ఈ సూపర్ మూన్ అనే పదాన్ని మొదటి సారి ఉపయోగించారు. ఒక ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఇలా సూపర్‌మూన్ ఏర్పడుతుంది. చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ భూమిని 27 రోజుల్లో చూట్టివస్తాడు. అలా తిరుగతూ అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ఆ స్థానాన్ని పేరీజీ అంటారు. ఇది భూమి నుంచి 3,63,300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అత్యంత దూరంలోని స్థానాన్నిఅపోజీగా పిలుస్తారు. అది 4,05,500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు సాధారణం కంటే 17శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రుడు. ఇలా సూపర్‌మూన్ ఏర్పడిన సమయంలో సముద్రం ఎక్కువగా ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది. గత నెల జూన్‌లో సంభవించిన సూపర్‌మూన్‌ను స్ట్రాబెరీ మూన్‌గా ( Strawberry Moon) వ్యవహరించారు.
అయితే ఈసారి అఫెలియన్ కారణంగా సూర్యుడు గ్రహం నుండి చాలా దూరంలో ఉన్న సమయంలోనే ఈ సూపర్ మూన్ ఏర్పడుతుంది. బుధవారం చంద్రుడు భూమికి కేవలం 3,57,264 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఈ సూపర్ మూన్.. గ్రహంపై అలల ప్రభావాలను కలిగి ఉంటుంది, దీని వలన చాలా ఎక్కువగా తక్కువగా అలలు తన రూపును సంతరించుకుంటాయి . ఈ సమయంలో సముద్ర తీరంలో ఏర్పడే తుఫానులు తీవ్ర వరదలకు దారితీయవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.2022 సూపర్‌మూన్‌ను 'బక్ మూన్' అని కూడా పిలుస్తారు
(The above story first appeared on LatestLY on Jul 12, 2022 11:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

