Swiggy: స్విగ్గీలో రూ. 33 కోట్లు మోసం, ఉద్యోగ సమయంలో నిధులను దారి మళ్లించిన మాజీ ఉద్యోగి, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్
స్విగ్గీలో మాజీ ఉద్యోగి భారీ మోసానికి పాల్పడ్డాడు. తమ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు తాను ఉద్యోగం చేసిన సమయంలో రూ.33 కోట్ల మేర దారి మళ్లించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. దీనిపై స్విగ్గీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్విగ్గీలో మాజీ ఉద్యోగి భారీ మోసానికి పాల్పడ్డాడు. తమ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు తాను ఉద్యోగం చేసిన సమయంలో రూ.33 కోట్ల మేర దారి మళ్లించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. దీనిపై స్విగ్గీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్విగ్గీ 2023-24 వార్షిక నివేదికను సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ అనుబంధ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి కంపెనీ నుంచి రూ.33 కోట్లు మళ్లించినట్లుగా వారు గుర్తించారు.
భూమి పొరల్లోంచి ఒక్కసారిగా పొగలు.. ఆందోళనతో పరుగెత్తిన హైదరాబాదీలు.. అసలేం జరిగింది?? ఇదిగో వీడియో!
ఈ అంశంపై స్విగ్గీ అంతర్గతంగా దర్యాఫ్తు చేసేందుకు కొందరు సభ్యులతో బృందాన్ని నియమించింది. అలాగే కోట్లాది రూపాయలు దారి మళ్లించినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదికలో స్విగ్గీ వెల్లడించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే స్విగ్గీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on Sep 06, 2024 10:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

