Hyderabad, Sep 6: హైదరాబాద్ (Hyderabad) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భూమి (Earth) పొరల్లోంచి ఒక్కసారిగా పొగలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద చోటుచేసుకుంది. ఇది చూసిన జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మొదట తక్కువగా వచ్చిన పొగలు, ఆ తర్వాత క్రమంగా పెరిగాయి. దీంతో ఒకింత ఆందోళనకు గురైన స్థానికులు పరుగుపెట్టారు.
బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య.. గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం
భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు.. ఆశ్చర్యపోయిన ప్రజలు
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద భూమిలో నుంచి ఒక్కసారిగా వచ్చిన పొగలు.. వాటిని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు.
అండర్ గ్రౌండ్లో ఇటీవల 11KV కేబుల్ అమర్చిన విద్యుత్ శాఖ.. దానివల్లే పొగలు వచ్చి ఉండొచ్చన్న ప్రజలు.
పొగలు రావడానికి అసలు… pic.twitter.com/nJHZMHpofV
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2024
కారణం ఇదేనా?
కేబీఆర్ పార్క్ వద్ద ఇటీవల విద్యుత్ శాఖ వారు అండర్ గ్రౌండ్ లో 11కేవీ కేబుల్ అమర్చినట్లు సమాచారం. దానివల్లే పొగలు వచ్చి ఉండొచ్చని పలువురు చెబుతున్నారు. అయితే, పొగలు రావడానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది.
పెట్రోల్ పోయించుకుంటుండగా బైక్ నుంచి మంటలు.. ఆ తర్వాత ఏం జరిగింది? రాజస్థాన్ లో ఘటన