TCS ends Hybrid Mode: వర్క్‌ ఫ్రమ్‌ హోం పద్దతికి టీసీఎస్‌ స్వస్తి, ఇక ఉద్యోగులంతా ఆఫీస్‌కు రావాల్సిందే అంటూ హుకుం, అక్టోబర్ 1 నుంచి ఎంప్లాయిస్‌ కు కొత్త పద్దతి

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) హైబ్రిడ్‌ వర్కింగ్ పాలసీకి (TCS ends hybrid mode) గుడ్‌బై చెప్పింది. అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చిందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది.

TCS ends Hybrid Mode: వర్క్‌ ఫ్రమ్‌ హోం పద్దతికి టీసీఎస్‌ స్వస్తి, ఇక ఉద్యోగులంతా ఆఫీస్‌కు రావాల్సిందే అంటూ హుకుం, అక్టోబర్ 1 నుంచి ఎంప్లాయిస్‌ కు కొత్త పద్దతి
TCS (Photo Credits: PTI)

Mumbai, SEP 29: ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) హైబ్రిడ్‌ వర్కింగ్ పాలసీకి (TCS ends hybrid mode) గుడ్‌బై చెప్పింది. అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చిందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. వచ్చే నెల నుంచి వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని కంపెనీ పేర్కొంది. ఇతర కంపెనీలూ టీసీఎస్‌ను అనుసరించే అవకాశం ఉంది.

 

కరోనా సమయంలో మొదలైన పూర్తి వర్క్‌ఫ్రమ్‌ (Work From Home) అనంతరం.. ఈ హైబ్రిడ్‌ వర్క్‌ సంస్కృతి (hybrid mode) మొదలైంది. దీంతో చాలా మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లి మిగిలిన రెండ్రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ, చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ పేరిట ఉద్యోగులు ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఇ-మెయిల్స్‌ వెళ్లినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఆయా డివిజన్ల మేనేజర్లు సూచిస్తున్నారు. ఉద్యోగులంతా కార్యాలయాలకు రావడం ఎంత అవసరమో కంపెనీ 2022-23 వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొంది.

ISRO Pragyan Rover: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్.. రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య 

కంపెనీలో పనిచేస్తున్న వారిలో సగం మంది ఉద్యోగులు 2020 మార్చి తర్వాత నియమితులైన వారేనని అందులో ప్రస్తావించింది. వీరంతా సీనియర్లు, లీమ్‌ లీడర్ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, వారి నడవడిక, ఆలోచనా తీరు నుంచి కొత్త వారు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని పేర్కొంది. ఉద్యోగులు పరస్పరం చర్చించుకోకుండా అభివృద్ధి సాధ్యం కాదని, కాబట్టి ఈ ఏడాదిలోనే దశలవారీగా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. ఇందులో భాగంగా టీసీఎస్‌ తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 29, 2023 10:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).