ISRO Pragyan Rover: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్.. రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య
చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) లో కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ (ISRO Pragyan Rover) చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉండి ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు.
Newdelhi, Sep 29: చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) లో కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ (ISRO Pragyan Rover) చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉండి ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ఈ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.
'Even if it doesn't wake up ...': Isro chief on efforts to reconnect with Pragyan roverhttps://t.co/ECclrPeVbr
— MSN India (@msnindia) September 28, 2023
ఖగోళాన్ని మరింత లోతుగా
ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్ రే పోలారిమీటర్ శాటిలైట్ పై (ఎక్స్ పోశాట్) ప్రస్తుతం దృష్టి సారించినట్టు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎక్స్ పోశాట్ తో పాటూ ఇన్‌శాట్-3డీని కూడా నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్టు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Sep 29, 2023 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

