Newdelhi, Sep 29: పోలీసు (Police) వాహనంపై కూర్చుని ఇన్ స్టా రీల్స్ (Insta Reels) చేసుకునేందుకు ఓ యువతిని అనుమతించిన పోలీసు అధికారిపై (Police Officer) వేటు పడింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరిన వెంటనే వారు ఆ పోలీసును సస్పెండ్ (Suspend) చేశారు. పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మ, యువతి కారుపై కూర్చుని వీడియో రికార్డు చేసేందుకు అనుమతించారు. దీంతో, ఆమె కారు బానెట్ పై కూర్చుని డ్యాన్స్ చేస్తున్నట్టు చేతులు ఊపింది. అంతేకాకుండా, అభ్యంతరకర రీతిలో వేళ్లతో సైగలు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియా బాట పట్టడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన పోలీసు శాఖ అశోక్ శర్మను సస్పెండ్ చేసింది.
This viral video is from #Jalandhar in which a girl is standing next to the police vehicle and making a reel for social media. pic.twitter.com/qknD2YxFc9
— Nikhil Choudhary (@NikhilCh_) September 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)