Newyork, Sep 29: అమెరికాలో (America) అతిపెద్ద నగరం న్యూయార్క్ (Newyork) కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి (Earth) లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది. నాసాకు (NASA) చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, రుట్జర్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం చేశారు. 2016-2023 మధ్యకాలంలో పరిశోధకులు రిమోట్ సెన్సింగ్ టెక్నిక్ సాయంతో దీనిపై అధ్యయనం చేశారు. ఇంటర్‌ఫెరోమెట్రిక్ సింథటిక్ అపాచ్యుర్ రాడార్ (ఐఎన్‌ఎస్‌ఏఆర్) టెక్నాలజీతో భూ కదలికల (వర్టికల్ ల్యాండ్ మోషన్)పై అధ్యయనం చేశారు. నిర్మాణాలు, పునరుద్ధరణ పనులతో పాటు సహజ సిద్ధమైన కొన్ని కారణాల వల్ల భూమి కుంగిపోతున్నదని పరిశోధకులు గుర్తించారు. ఎర్త్ మాంటిల్ సర్దుకుపోవడం కారణంగా కూడా ఈ పరిణామం జరుగుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
#NewYork is sinking: #NASA study reveals city's human-made problem
It found that much of motion is in areas where prior modifications to Earth's surface, such as land reclamation & landfill construction, made ground beneath more compressible.#USA
Reporthttps://t.co/bzZRj1utYi
— Geopolitics_Eye (@VinodkumarG01) September 29, 2023
పైకి చొచ్చుకురావడం కూడా..
నగరంలోని లాగార్డియా విమానాశ్రయంలోని ఓ రన్‌వే ఏటా 3.7 మిల్లీ మీటర్లు, ఆర్థర్ యాష్ స్టేడియం 4.6 మిల్లీ మీటర్ల మేర కుంగిపోతున్నది. మరోవైపు విలియమ్స్ బర్గ్, బ్రూక్లిన్, వుడ్‌సైడ్, క్వీన్స్ తదితర ప్రాంతాలు ఏటా 1.6- 6.9 మిల్లీ మీటర్ల వరకు భూమి పైకి చొచ్చుకొస్తున్నాయి. అయితే దీనికి గల కారణాలు ఇంకా తెలియలేదు.