Violence in Manipur (Image Credits - Twitter/@MangteC)

Imphal, Sep 27: అనుమానాస్పద కుకీ మిలిటెంట్లచే చంపబడినట్లు ఆరోపించబడిన ఇద్దరు తప్పిపోయిన మీటీ యువకుల మృతదేహాల యొక్క అనేక ఫోటోలు ఇంటర్నెట్‌లో కనిపించాయి.ఈ చిత్రాలలో ఒకటి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను చూపగా, మరొకటి ఇద్దరు సాయుధ వ్యక్తుల మధ్య విద్యార్థులు భయంతో కూర్చున్నట్లు చూపిస్తుంది.

ఈ ఫోటోలు వైరల్ కావడంతో సెప్టెంబర్ 26న ఇంఫాల్‌లోని వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. రాష్ట్రంలో జాతి హింస ఉధృతంగా (Manipur Violence) ఉన్న సమయంలో - జూలై 6న అదృశ్యమైన ఇద్దరు మైతే విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి ఇంఫాల్‌లో ప్రదర్శన నిర్వహించారు.ఈ నేపథ్యంలో మణిపూర్‌లో ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

మణిపూర్‌లో అసలేం జరుగుతోంది, ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య వెనుక సూత్రధారులెవరు, రోడ్డు మీదకు వచ్చి నిరసన చేపట్టిన వేలాది మంది విద్యార్థులు

1 అక్టోబర్ 2023 రాత్రి 7.45 గంటల వరకు రాష్ట్రంలో ఆంక్షలు అమలులో ఉంటాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేయనున్నట్లు మణిపూర్ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇక నిరంతర నిరసనల మధ్య రాష్ట్రంలో AFSPA అక్టోబర్ 1 నుండి 6 నెలల పాటు (AFSPA extended for 6 months) పొడిగించబడింది.

మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్య వెలుగులోకి రావడంతో మరోసారి అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. విద్యార్థుల మృతికి నిరసనగా పెద్దఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని (AFSPA) మరో ఆరు నెలల పాటు పొడిగించింది.

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందరి ముందే సామూహిక అత్యాచారం, మణిపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి..

మే 3న మొదలైన అల్లర్లకు మణిపూర్ రాష్ట్రం నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంది. కొన్నాళ్ల క్రితం ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన వీడియో ఎలాంటి పరిణామాలను సృష్టించిందో తాజాగా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లోని కంగ్లా కోట సమీపంలో నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల దాడిలో సుమారు 45 మంది విద్యార్థినీ విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు

మణిపూర్ అల్లర్లు జరిగి ఐదు నెలల తర్వాత సెప్టెంబర్ 23న మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన ప్రభుత్వం తిరిగి మంగళవారం నుండి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. పదేపదే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇంఫాల్ లోయ వద్ద 19 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాన్ని మినహాయించి మిగతా రాష్ట్రమంతా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. అదేవిధంగా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల అఫ్‌స్పా చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సీఎం బైరెన్ సింగ్ ఇద్దరు విద్యార్థుల కేసులో దర్యాప్తుకు సీబీఐని ఆదేశించారు.

డిస్ట‌ర్బడ్ ఏరియాల్లో రాష్ట్ర రాజ‌ధాని ఇంఫాల్‌, లాంపెల్‌, సిటీ, సింగ‌జేమి, సేక్మాయి, లాంసంగ్‌, పాత్సోయి, వాంగోయి, పోరాంప్ట్‌, హెయిన్‌గ్యాంగ్‌, లాంలాయి, ఇరిల్‌బంత్‌, లీమాఖాంగ్‌, తౌబాల్‌, బిష్ణుపుర్, నంబోల్, మొయిరాంగ్‌, కాక్‌చింగ్‌, జీరిబ‌మ్ ఉన్నాయి. ఆరు నెల‌ల పాటు ఈ ప్రాంతాల్లో ప్ర‌స్తుతం ఉన్న భ‌ద్ర‌తా ప‌రిస్థితినే కొన‌సాగించ‌నున్నారు