ఏపీలో పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున బైకుకు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు చెల్లించకుండా,డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు. 'తాను పోలీసునని, డబ్బులు అడుగుతావా' అంటూ దుర్భాషలాడి, బంకులోని వస్తువులను ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కాకినాడలో దారుణం, మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కౌన్సిలర్ నారాణయరావు, దేహశుద్ది చేసిన స్థానికులు, వీడియో ఇదిగో..

Constable Attacks Petrol Pump Staff Over Petrol Payment Dispute

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)