కాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. అయితే తాను అమ్మాయిపై అత్యాచార యత్నం చేయలేదంటూ నారాయణరావు వాదిస్తున్నాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో పోలీసులు నారాయణ రావును అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని శిక్షించాలంటూ గురుకుల పాఠశాల వద్ద బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు బాలికపై 3 సార్లు అత్యాచారం జరిగిందని..గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రక్షణ లేదు అని ఆరోపించారు. పాఠశాల నిర్వహకులు బాలికతో ఎలాంటి సంబంధం లేని నారాయణరావుతో ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతోనే అతనిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Tuni Councillor Narayana Rao Arrested for Attempted Rape of Minor in Kakinada
కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావుకు దేహశుద్ది చేసిన స్థానికులు https://t.co/RKQdgnPnR9 pic.twitter.com/d85cbLLso0
— ChotaNews App (@ChotaNewsApp) October 22, 2025
ఒకసారి కాదు రెండు సార్లు కాదు పాపపై 3 సార్లు అత్యాచారం జరిగింది
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రక్షణ లేదు
నారాయణ రావును కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు
బాలికపై అఘాయిత్యం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది..?
మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి.. అతడిని… https://t.co/RKQdgnPnR9 pic.twitter.com/pe0DrUPXKi
— ChotaNews App (@ChotaNewsApp) October 22, 2025
నేను కొత్తగా వచ్చాను.. పిల్లల పేరెంట్స్ పరిచయం లేదు
గతంలో కూడా నారాయణరావు నాలుగు సార్లు వచ్చి బాలికను తీసుకెళ్లారు
నారాయణ రావు తన తాత అని బాలిక చెప్పడం వల్లే పంపించాము
- గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ https://t.co/RKQdgnPnR9 pic.twitter.com/oACrnJCkwu
— ChotaNews App (@ChotaNewsApp) October 22, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)