TCS: 5జీ నెట్ వర్క్ అందిస్తామంటూ సంచలన ప్రకటన చేసిన టీసీఎస్, 2023 లేదా 2024 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని వెల్లడి, చైనాలో షాకిస్తున్న 6జీ మొబైల్ టెక్నాలజీ
ప్రపంచవ్యాప్తంగా ఏ టెలికం సంస్థకైనా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS ready to roll out 5G network) హెడ్ కమల్ భదాడా తెలిపారు. ఇప్పటికే పలు దేశాల్లోని టెల్కోలకు టెక్నాలజీ (5G network for telecom operator) ఇవ్వడంతో పాటు వాటి నెట్‌వర్క్‌లను నిర్వహించే సర్వీసులు కూడా అందిస్తున్నట్లు వివరించారు.

దేశీ అవసరాలకు తగ్గట్లు నెట్‌వర్క్‌పై మరింతగా కసరత్తు చేస్తున్నామని కమల్ వివరించారు. ప్రస్తుతం చాలా దేశాల్లో 5జీ నెట్‌వర్క్ వినియోగం మధ్యలో ఉండగా.. భారత్‌లో ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నారు. 2023 లేదా 2024 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు మరో 3–4 ఏళ్లు పడుతుందని కమల్ తెలిపారు. అటు పైన 6జీ నెట్‌వర్క్ కోసం ప్రక్రియ ప్రారంభం కాగలదని వివరించారు.
ఇక 6జీ మొబైల్ టెక్నాలజీ వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ స్పీడ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. చైనా రీసెర్చర్లు సెకన్ వ్యవధిలో 206.25 డేటాను షేర్ చేసే కెపాసిటీ 6జీ టెక్నాలజీని బిల్డ్ చేసినట్లు చైనా మీడియా తన కథనంలో పేర్కొంది. అంతేకాదు 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 5జీ కంటే 100రెట్లు ఫాస్ట్‌గా పనిచేస్తుందని వెల్లడించింది.
గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి
ఉదాహరణకు 4కే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ మొత్తం 59.5గంటలు ఉండగా..ఆ మొత్తాన్ని చిటికెలో డౌన్‌లోడ్ చేయొచ్చు. అంటే 206.25గిగా బైట్ల వేగంతో ఆ అన్నిగంటల సినిమాను కేవలం 16 సెకన్లలో డౌన్‌లోడ్ చేయొచ్చన్నమాట. కాగా, సౌత్ కొరియా మీడియా కథనాల ప్రకారం..టెలికాం సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు 6జీ టెక్నాలజీ 2030 కల్లా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Mar 23, 2022 04:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).