Telcos Disconnect 73 Lakh Mobile Connections: 73 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్ చేసిన కేంద్రం, ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని టెల్కోలకు డాట్ ఆదేశం
వివరాల ధ్రువీకరణలో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్లు బుధవారం లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) టెల్కోలను ఆదేశించింది.
Telcos Disconnect 73 Lakh Mobile Connections: వివరాల ధ్రువీకరణలో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్లు బుధవారం లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) టెల్కోలను ఆదేశించింది. నకిలీ ఐడీలు లేదా అడ్రస్‌లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించినట్లు ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను డాట్ గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్‌లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల రీవెరిఫికేషన్‌లో విఫలం కావడంతో డిస్‌కనెక్ట్ చేశాం" అని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు. ఆర్బీఐ కీలక అప్‌డేట్, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన
అలాగే నకిలీ రుజువులతో సిమ్‌లను యాక్టివేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నకు కూడా మంత్రి సమాధానమిచ్చారు. "పాన్-ఇండియా ప్రాతిపదికన అన్ని ఆపరేటర్లలో ఒక వ్యక్తి కలిగి ఉండే మొబైల్ కనెక్షన్ల నిర్ణీత పరిమితిని మించి దాదాపు 16 లక్షల మంది చందాదారులు కలిగి ఉన్న సుమారు 1.92 కోట్ల మొబైల్ కనెక్షన్‌లను డాట్ గుర్తించింది. వీటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దాదాపు 66 లక్షల మొబైల్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేశాయి. తద్వారా ఈ 16 లక్షల మంది చందాదారులకు మొబైల్ కనెక్షన్‌లను నిర్ణీత పరిమితిలోపు తీసుకురావడం జరిగిందని మంత్రి చెప్పారు.
(The above story first appeared on LatestLY on Aug 08, 2024 04:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

