RBI Governor Shaktikanta Das

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పన్ను చెల్లింపుల UPI పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది. దీనర్థం మీరు ఇప్పుడు UPIని ఉపయోగించి పెద్ద పన్ను మొత్తాలను త్వరగా, సులభంగా చెల్లించవచ్చు.ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ కీలక మార్పు అంశాన్ని ఆయన తెలిపారు. దీంతో వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు జరిపేవారు ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు.

యూపీఐ చెల్లింపుల పరిమితిని 2023 డిసెంబర్‌లోనూ సవరించారు. వైద్య ఖర్చులు, విద్యాసంస్థల్లో ఫీజులను యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. అంతకుముందు, క్యాపిటల్ మార్కెట్లు, బీమా, రెమిటెన్స్‌ల చెల్లింపుల పరిమితిని కూడా రూ.2 లక్షలకు చేసింది. ఐపీవోలలో పెట్టుబడి, రిటైల్ డైరెక్ట్ స్కీంలలో ఒక్క ట్రాన్సాక్షన్‌కు యూపీఐ ద్వారా రూ.5 లక్షలు చెల్లించే అవకాశం కూడా కల్పించింది. ఆర్థికరంగ విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.5 శాతం వద్దే రెపోరేటు

యూపీఐలో డెలిగేటెడ్ చెల్లింపుల వ్యవస్థను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం ద్వారా ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి నిర్దేశిత పరిమితి వరకు యూపీఐ లావాదేవీ చేసేందుకు మరొక వ్యక్తికి అనుమతిని ఇవ్వవచ్చు. ఈ రెండో వ్యక్తికి యూపీఐకి అనుసంధానించిన బ్యాంకు ఖాతా ఉండవలసిన అవసరం లేదు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఈ సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ చర్యలు ప్రజలు తమ పన్నులను చెల్లించడాన్ని సులభతరం చేస్తాయని, డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తాయని ఆర్‌బిఐ గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు.