Budget 2025: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు ఈ బడ్జెట్‌లో నిరాశ తప్పేలా లేదు, పాత పన్ను విధానంతో పోలిస్తే...నూతన పన్ను విధానంలో ఈ ఐదు మినహాయింపులు ఉండవు

కొత్త పన్ను విధానం(New Tax Regime), రాయితీతో కూడిన పన్ను రేట్లను అందిస్తున్నప్పటికీ, పాత పన్ను విధానంలో అందుబాటులో ఉండే అనేక ముఖ్యమైన పన్ను ప్రయోజనాలను అందుకోలేరు.

Budget 2025: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు ఈ బడ్జెట్‌లో నిరాశ తప్పేలా లేదు, పాత పన్ను విధానంతో పోలిస్తే...నూతన పన్ను విధానంలో ఈ ఐదు మినహాయింపులు ఉండవు

New Delhi, JAN 30: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఫిబ్రవరి 1న ఈ కేంద్ర బడ్జెట్ 2025ను (Budget 2025) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది వరుసగా 8వ సారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర బడ్జెట్ 2025 ప్రకటనకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, కొత్త పన్ను విధానంపై పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ గందరగోళంలో ఉన్నారు.

EPFO Adds 14.63 Lakh Net Members: ఈపీఎఫ్‌లో కొత్తగా 14.64 లక్షల మంది చేరిక, గతేడాది డేటాను విడుదల చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  

బయే కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు ఉండకపోవచ్చు. అయితే, పన్ను చెల్లింపుదారులు ఈ బడ్జెట్‌పైనే గంపెడు ఆశలు పెట్టేసుకున్నారు. బడ్జెట్ 2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం(New Tax Regime), రాయితీతో కూడిన పన్ను రేట్లను అందిస్తున్నప్పటికీ, పాత పన్ను విధానంలో అందుబాటులో ఉండే అనేక ముఖ్యమైన పన్ను ప్రయోజనాలను అందుకోలేరు. ఇప్పటికే, కొత్త పన్ను విధానంలో పాత పన్ను విధానంలా ఎక్కువగా మినహాయింపులు ఉండవని సంగతి విధితమే.

హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) :

హౌస్ రెంట్ అలవెన్స్ కోసం అయ్యే ఖర్చులకు యజమాని ద్వారా ఉద్యోగికి ఇవ్వడం జరుగుతుంది. పాత విధానంలో పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించేటప్పుడు (HRA) మినహాయింపు మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి తొలగిస్తారు. తద్వారా వ్యక్తులు పన్నులపై ఆదా చేసుకోవచ్చు.

UPI Payments Key Update: ఫిబ్రవరి 1 నుంచి వీళ్లు యూపీఐ పేమెంట్స్‌ చేయలేరు, ఇలాంటి పేమెంట్స్‌ను అంగీకరించేది లేదని ప్రకటించిన NCPI 

హోమ్ లోన్‌పై వచ్చే వడ్డీ :

ఇది పాత పన్ను విధానంలో సెక్షన్ 24(B) కింద లభించే మరో ముఖ్యమైన మినహాయింపు. గృహ రుణంపై వచ్చే వడ్డీపై రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.

ప్రయాణ రాయితీ (LTC) :

పాత పన్ను విధానంలో ఉన్న ఈ భత్యం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించడానికి ఉద్యోగికి యజమాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. పన్నుల నుంచి మినహాయింపు కోసం ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 36వేలు పొందవచ్చు. ఎల్టీసీ కింద ఉద్యోగి ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాన్ని క్లెయిమ్ చేయలేరు.

పిల్లల విద్యాభత్యం (CEA) :

పాత పన్ను విధానంలో ఉన్న ఈ భత్యం ఉద్యోగులకు వారి పిల్లల విద్యా ఖర్చులను కవర్ చేసేందుకు వీలుంటుంది. తద్వారా వారి ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే, కొత్త పన్ను విధానంలో ఇది అందుబాటులో లేదు.

రాజకీయ పార్టీకి ఇచ్చిన విరాళాలు :

పాత పన్ను విధానంలో, సెక్షన్ 80GGB ఏదైనా విరాళాలు లేదా రాజకీయ పార్టీకి చేసిన విరాళాలకు మినహాయింపును అందిస్తుంది. అయితే, నగదు రూపంలో ఇచ్చే విరాళాలు ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపులకు అర్హులు కాదు.

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 10:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).