UPI Payments Key Update: ఫిబ్రవరి 1 నుంచి వీళ్లు యూపీఐ పేమెంట్స్ చేయలేరు, ఇలాంటి పేమెంట్స్‌ను అంగీకరించేది లేదని ప్రకటించిన NCPI
యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? వచ్చే ఫిబ్రవరి 1 నుంచి ఇలాంటి యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేయలేరు. ఎందుకో తెలుసా? యూపీఐ పేమెంట్ ఐడీలో కారణమట.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. యూపీఐ అనేది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఒక యూపీఐ యూజరు మరో యూపీఐ యూజర్, ఒక యూజర్ నుంచి మర్చంట్ యూజర్ కు సులభంగా పేమెంట్లు చేసుకునేందుకు వీలుంది.
New Delhi, JAN 29: యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? వచ్చే ఫిబ్రవరి 1 నుంచి ఇలాంటి యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేయలేరు. ఎందుకో తెలుసా? యూపీఐ పేమెంట్ ఐడీలో కారణమట.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. యూపీఐ అనేది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఒక యూపీఐ యూజరు మరో యూపీఐ యూజర్, ఒక యూజర్ నుంచి మర్చంట్ యూజర్ కు సులభంగా పేమెంట్లు చేసుకునేందుకు వీలుంది. చాలా వేగంగా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. ఎంతో సెక్యూర్‌గా పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. యూపీఐ అకౌంట్లతో పర్సనల్ బ్యాంకింగ్ పేమెంట్స్ మాత్రమే కాదు.. క్రెడిట్ కార్డు బిల్స్ పేమెంట్స్, ఆన్‌లైన్ ఇ-కామర్స్ పేమెంట్లను చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు. యూపీఐ ఫీచర్లలో లావాదేవీ ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది. ఈ సిస్టమ్ డిజిటల్ యాప్, మొబైల్ ఫోన్ల నుంచి లావాదేవీలను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది.
February 2025 Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకు పనులున్నాయా? ఎన్ని రోజులు సెలవులున్నాయంటే?
ప్రస్తుతం యూపీఐ సర్వీసులను (UPI Services) అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ప్రతి యూపీఐ పేమెంట్‌కు స్పెషల్ యూపీఐ క్రియేట్ అవుతుంది. ఇందుకు ఎలాంటి పేపర్ వర్క్ అక్కర్లేదు. పేమెంట్ చేయడం, పేమెంట్ పొందడం, మొబైల్ రీఛార్జులు, బిల్ పేమెంట్స్ వంటి ఇతర ఆన్‌లైన్ సర్వీసులకు కూడా సులభంగా యాక్సస్ చేసేందుకు వీలుంది. యూపీఐ సర్వీసుల్లో ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, జియో వంటి అనేక డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ఈ యూపీఐ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
యూపీఐ సిస్టమ్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్లతో నమోదు చేసిన లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఫిబ్రవరి 1, 2025 నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి స్పెషల్ క్యారెక్టర్లతో వాడే ట్రాన్సాక్షన్ ఐడీలను అనుమతించేది లేదని ఎన్‌పీసీఐ (NPCI) ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది.
దీని ప్రకారం.. యూపీఐ ఐడీలలో ఆల్ఫాన్యూమరిక్, నంబర్స్ ఉన్న ట్రాన్సాక్షన్ ఐడీలు మాత్రమే అనుమతిస్తాయని ఎన్పీసీఐ పేర్కొంది. ఈ కొత్త మార్పులతో యూపీఐ సిస్టమ్ పార్టనర్లందరూ సిస్టమ్స్‌లో మార్పులు చేసుకోవాల్సిందిగా సూచనలు చేసింది.
ప్రతి యూపీఐ పేమెంట్‌కు ఒక స్పెషల్ ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటుంది. వాస్తవానికి, యూపీఐ ఐడీలు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సాధారణగా యూపీఐ అకౌంట్ ఐడీలలో అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి. కొన్నిసార్లు స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఉండవచ్చు.
ఉదాహరణకు.. #, $, &, *, @, % ) వంటివి ఉంటాయి. ఈ స్పెషల్ క్యారెక్టర్లు కలిగిన యూపీఐ ఐడీలను ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ సిస్టమ్ అనుమతించదని గమనించాలి. ఈ కొత్త మార్పు టెక్నికల్ ఫీచర్లకు తగినట్టుగా ఎన్‌పీసీఐ అమల్లోకి తీసుకురానుందని వెల్లడించింది. ప్రస్తుత రోజుల్లో యూపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో 16.73 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఈ యూపీఐ లావాదేవీల మొత్తం రూ.23.25 లక్షల కోట్లకు చేరుకున్నట్టుగా అంచనా. అదే గత నెలతో పోలిస్తే.. 8 శాతానికి పెరిగినట్టుగా సూచిస్తోంది.
యూపీఐలో కొత్త మార్పులు రానున్నాయి. ప్రత్యేకించి యూపీఐ లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకురానున్నట్టు ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల జంప్డ్ డిపాజిట్ స్కాముల జరుగుతున్న తరుణంలో యూపీఐ వినియోగదారులు కేవలం ఈ రకమైన పిన్ ఎంటర్ చేస్తేనే లావాదేవీలను పూర్తి చేయగలరని ఎన్‌పీసీఐ పేర్కొంది. ఈ కొత్త మార్పులకు అనుగుణంగా యూపీఐ వినియోగదారులు తమ లావాదేవీలను చాలా వేగంగా ఎంతో సేఫ్‌గా నిర్వహించేందుకు వీలుంటుంది.
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 10:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

