ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ(Chat GPT) సేవల్లో అంతరాయం(Crash Down) ఏర్పడింది. దీని క్రాష్ డౌన్ తో యూజర్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) సహాయంతో నడిచే చాట్ బాట్(Chat Bot) లో ఒకటైన చాట్ జీపీటీని ప్రపంచం మొత్తం మీద ఎక్కువమంది వినియోగిస్తున్నారు.

ఈపీఎఫ్‌లో కొత్తగా 14.64 లక్షల మంది చేరిక, గతేడాది డేటాను విడుదల చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్

చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ(OPEN AI) మాత్రం ఈ అంతరాయంపై ఇంతవరకు నోరు విప్పలేదు. చాట్ బాట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టెక్ ఉద్యోగులంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, కోడింగ్ విషయాల్లో చాట్ జీపీటీ సర్వీసులు వాడుతుండటంతో.. వారి పనులన్నీ ఆగిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ChatGPT Down:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)