Newdelhi, Dec 16: కృత్రిమ మేధ(ఏఐ-AI) రంగంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT) యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు మొండికేస్తున్నది. పొడిపొడిగానే సమాధానాలిస్తున్నది. మరింత సమాచారం కావాలంటే వేరే సాధనాల ద్వారా వెతుక్కోండి అంటూ కఠినంగా చెప్తున్నది. దీంతో ఏఐ చాట్‌బోట్ (ChatBot) వైఖరిపై పలువురు యూజర్లు మండిపడుతూ మాతృసంస్థ ఓపెన్‌ఏఐకు ఫిర్యాదులు చేశారు. స్పందించిన నిర్వాహకులు గత నవంబర్ నుంచి చాట్‌బోట్‌ను అప్ డేట్ చేయలేదని, అందుకే, అలాంటి సమాధానాలు రావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
Is AI already sick of us? Makers of ChatGPT admit the bot has started refusing to respond to users' requests https://t.co/1M1EUENowd pic.twitter.com/4o5WIbDLzd
— Daily Mail US (@DailyMail) December 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)