Google Maps New Feature: బండిలో పెట్రోల్ ఆదా చేసుకునేలా గూగుల్ మ్యాప్ లో కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే??
తెలియని రూట్లను తెలియజెప్పే గూగుల్ మ్యాప్ మరింత సౌకర్యవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నది. ఈ మేరకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్ కంపెనీ ప్రకటించింది.
Newdelhi, Dec 16: తెలియని రూట్లను తెలియజెప్పే గూగుల్ మ్యాప్ (Google Maps) మరింత సౌకర్యవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా (User Friendly) మారనున్నది. ఈ మేరకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్ (Google) కంపెనీ ప్రకటించింది. ప్రయాణికులు తమ వాహనాల్లోని ఇంధనాన్ని మరింతగా ఆదా చేసుకునేందుకు కొత్త ఫీచర్ (రూట్ ఆప్షన్)ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. దీని ప్రకారం.. వాహనం ఇంజిన్ ను అనుసరించి ఎకో ఫ్రెండ్లీ రూట్ (ఇంధనం ఖర్చు తక్కువ అయ్యే మార్గం), ఎక్కువ ఇంధనం తీసుకునే ‘ఫాస్టెస్ట్ రూట్’ను గూగుల్ మ్యాప్ చూపుతుందట. భారత్ సహా ఎంపిక చేసిన దేశాల్లో సరికొత్త ఫీచ ర్‌తో కూడిన గూగుల్ మ్యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Google Maps Introduces New Feature To Save Fuel Costs. Here's How It Works https://t.co/9JcJrPbUZ4 pic.twitter.com/TgnMNGyyY6
— NDTV (@ndtv) December 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 16, 2023 09:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

