New Delhi, JAN 25: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లో ఖాతాలు (Bank Holidays) నిర్వహిస్తూ ఉంటారు. డిజిటలైజేషన్‌తో ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నా.. కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలను సందర్శించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రతి ఒక్కరి సమయం చాలా విలువైనది. బ్యాంకు శాఖలకు వెళ్లాలని నిర్ణయించుకున్న వారు.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తున్నాయా..? లేదా… అన్న విషయం తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. కొత్త సంవత్సరం 2025లో జనవరి మరో ఆరు రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్నది.

Mobile SIM Swap Scam: తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ 

వచ్చే శనివారం నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభం కానున్నది. ఫిబ్రవరి (February 2025) నెలలో వారాంతపు సెలవులతోపాటు జాతీయ స్థాయి పర్వదినాలు, పండుగలు, ప్రాంతీయ వేడుకల సందర్భంగా ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వచ్చేనెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజుల పాటు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. ఆ సెలవుల జాబి గురించి తెలుసుకుందామా..!

SBI YONO Alert: ఎస్‌బీఐ యోనో యాప్‌పై కీలక ప్రకటన, ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ ఉన్న వారికి మార్చి 1 నుంచి సేవలు బంద్, కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన 

ఫిబ్రవరి 3 (సోమవారం): సరస్వతి పూజ సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తలలో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 11 (మంగళవారం): థాయిపుసం సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 12 (బుధవారం): శ్రీరవిదాస్ జయంతి సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో బ్యాంకులకు సెలవు

ఫిబ్రవరి 15 (శనివారం) : లోయి-నాగాయి-నీ సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 19 (బుధవారం) : ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా బెలాపూర్‌, ముంబై, నాగ్‌పూర్‌ల్లో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 20 (గురువారం) : రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల రాజధానులు ఇటానగర్‌, ఐజ్వాల్‌ పట్టనాల్లో బ్యాంకుల మూసివేత.

ఫిబ్రవరి 26 (బుధవారం) : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతోపాటు గుజరాత్‌, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛండీగఢ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, జమ్ము, ఉత్తరప్రదేశ్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 28 (శుక్రవారం): లోసార్‌ సందర్భంగా సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు

వీటితోపాటు వారాంతపు శనివారాలు, ఆదివారాల్లో సెలవులు ఇలా..

ఫిబ్రవరి 2 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.

ఫిబ్రవరి 8 (రెండో శనివారం) : దేశవ్యాప్తంగా సెలవు.

ఫిబ్రవరి 9 (ఆదివారం) : దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

ఫిబ్రవరి 16 (ఆదివారం) : దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 22 (నాలుగో శనివారం) : దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 23 (ఆదివారం) : బ్యాంకులకు దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు.