Beware of audiovideo calls from Cyber criminals says VC Sajjanar(X)

Bengaluru, Jan 20: కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కస్టమ్స్‌ అధికారులమంటూ బెదిరించి ఓ టెకీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు. ప్రైవేట్ బ్యాంకు ప్రతినిధుల పేరుతో మొబైల్ ఫోన్లు పంపి మోసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైట్ ఫీల్డ్ సీఈఎన్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసగాళ్లు పంపిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నగదు బదిలీ చేసిన ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు.

మోసం ఎలా జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కొత్త సిమ్‌ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియర్ లో నిజంగానే సెల్ ఫోన్ పంపించారు.కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్ లోని సిమ్ తీసి కొత్త ఫోన్ లో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్ లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోన్ కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు.

ఎస్‌బీఐ యోనో యాప్‌పై కీలక ప్రకటన, ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ ఉన్న వారికి మార్చి 1 నుంచి సేవలు బంద్, కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన

అయితే, అప్పటికే ఆ ఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్ వర్డ్ లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.

తెలియని వ్యక్తులు పంపిన ఎలాంటి ఉచిత ఆఫర్‌లను ఉపయోగించవద్దు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైట్‌ఫీల్డ్ డివిజన్ డీసీపీ శివకుమార్ గుణారే తెలిపారు. సైబర్ మోసగాళ్లు మొబైల్ ఫోన్‌లను పంపుతూ, ఫోన్‌లో నిరంతరం టచ్‌లో ఉంటారు. ఫోన్‌లో సిమ్ కార్డ్ పెట్టాలని, అందులో వచ్చే సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని సూచిస్తున్నారు. సమాచారం పంపుతున్న సమయంలో ఫోన్ క్లోన్ చేయడంతో బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ మోసగాళ్ల వద్దకు వెళ్లి మీరు నష్టపోతారని హెచ్చరించారు.