Offline UPI Payments: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని తెలుసా, ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా నెట్ లేకుండా మీరు ఎవరికైనా డబ్బులు పంపుకోండి

నగదు బదిలీల కోసం అందరూ UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. అయితే ఇంటర్నెట్ సమస్య అందరినీ వేధిస్తూ ఉంది. నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై వస్తూ ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే కొత్త సర్వీసును NPCI అందుబాటులోకి వచ్చింది.

Offline UPI Payments: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని తెలుసా, ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా నెట్ లేకుండా మీరు ఎవరికైనా డబ్బులు పంపుకోండి
Mobile (Photo Credit: File)

నగదు బదిలీల కోసం అందరూ UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. అయితే ఇంటర్నెట్ సమస్య అందరినీ వేధిస్తూ ఉంది. నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై వస్తూ ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే కొత్త సర్వీసును NPCI అందుబాటులోకి వచ్చింది.

బ్యాంకుల అంతటా యూపీఐ (UPI) సేవలను మరింత మెరుగపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సేవ'ను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడమే. అనంతరం నెట్ లేకుండా యూపీఏ లావాదేవీలకు ఈ ప్రాసెస్ పూర్తి చేయండి.

యూజర్లకు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం షాక్, త్వరలో లావాదేవీలపై పరిమితిని విధించనున్న UPI చెల్లింపు యాప్‌లు

► మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి.

► తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ అడుగుతుంది. దాని ప్రకారం, కోడ్‌ను ఎంటర్‌ చేస్తే సరిపోతుంది.

► ఈ ప్రాసెస్ పూర్తికాగానే మీకు ఇలా కనిపిస్తుంది..

►1.Send Money

►2. Request Money

►3. Check Balance

►4. My Profile

►5. Pending Request

►6. Transactions

►7. UPI Pin

► పైన చూపిస్తున్న సేవలలో మీకు ఏది కావాలో ఆ నంబర్ ఎంచుకోండి.► ఇప్పుడు మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోండి. ఇలా.. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు.. టైప్‌ చేసి (send) ఎంటర్‌ చేయండి.

► మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే, రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

► ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్‌ చేసి పంపండి.

► ఆపై మీ యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి (send) ఆప్షన్‌ క్లిక్‌ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్‌ లేకుండా పూర్తవుతుంది.

(The above story first appeared on LatestLY on Nov 21, 2022 04:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).