WhatsApp: షాకింగ్ న్యూస్, వాట్సాప్‌‌లో 66 లక్షలకు పైగా అకౌంట్లు బ్యాన్, ఫిర్యాదులతో సంబంధం లేకుండా లేపేసిన మెటా

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.

WhatsApp: షాకింగ్ న్యూస్, వాట్సాప్‌‌లో 66 లక్షలకు పైగా అకౌంట్లు బ్యాన్, ఫిర్యాదులతో సంబంధం లేకుండా లేపేసిన మెటా
WhatsApp (Photo Credits: Pixabay)

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.

2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు వాట్సాప్‌ తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు జూన్‌ నెలలో 7,893 ఫిర్యాదులు అందగా వీటిలో 337 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

ఇకపై రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్, పిల్లల కోసం మొబైల్ స్క్రీన్ సమయ పరిమితిని విధించిన చైనా

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్‌లకు పైగా యూజర్లు ఉన్నారు. యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌లో నమోదైన ఫిర్యాదులకు అనుగుణంగా కొన్ని అకౌంట్లపై చర్యలు తీసుకోగా నిబంధనలు అతిక్రమించిన మరికొన్ని అకౌంట్లపై ముందస్తు చర్యలు చేపట్టినట్లు వాట్సాప్‌ పేర్కొంది. చర్యల నిమిత్తం గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపింది.

(The above story first appeared on LatestLY on Aug 03, 2023 07:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).