Wipro Divestment Plans: విప్రో మరో సంచలన నిర్ణయం, హైదరాబాద్, బెంగళూరు ఆస్తులను అమ్మే ఆలోచనలో టెక్ దిగ్గజం, కారణం ఏంటంటే..

నాన్-కోర్ రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి విప్రో బెంగళూరు, హైదరాబాద్‌లోని రెండు కార్యాలయ ఆస్తులను విక్రయిస్తోంది . ఈ ఆస్తులలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మరియు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌ల భాగాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

Wipro Divestment Plans: విప్రో మరో సంచలన నిర్ణయం, హైదరాబాద్, బెంగళూరు ఆస్తులను అమ్మే ఆలోచనలో టెక్ దిగ్గజం, కారణం ఏంటంటే..
(Photo Credit: Twitter

నాన్-కోర్ రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి విప్రో బెంగళూరు, హైదరాబాద్‌లోని రెండు కార్యాలయ ఆస్తులను విక్రయిస్తోంది . ఈ ఆస్తులలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మరియు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌ల భాగాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఉద్యోగాల్లో కోతతో పాటుగా, ఆస్తులను సైతం విక్రయించాలని విప్రో యోచిస్తోంది.

Economictimes కథనం ప్రకారం.. హైదరాబాద్‌, బెంగళూరులోని తన ఆస్తులను విక్రయించాలని విప్రో నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ కలిగి ఉన్న నాన్ కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కంపెనీ విక్రయించాలనుకుంటున్న ప్రాపర్టీల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాంపస్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌లు ఉన్నట్లు వెల్లడైంది.

అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్

గచ్చిబౌలి విప్రో క్యాంపస్‌ దాదాపు 14 ఎకరాలమేర విస్తరించి ఉంది. ఇక బెంగళూరులో 25 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే కంపెనీ ఆ భూమిని పూర్తిగా లేదా కొంతమేరకే విక్రయిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. బెంగళూరు క్యాంపస్‌ను దశల వారీగా అమ్మనున్నట్లు సమాచారం. మొదటి దశలో ఐదు ఎకరాలు విక్రయిస్తుందని తెలిసింది.అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

హైదరాబాదులో విప్రోకు మొత్తం మూడు ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉండగా.. ఒకటి మణికొండలో ఉంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల క్రితం కంపెనీకి భూమి కేటాయించింది. సెప్టెంబర్‌ త్రైమాసికం వరకు విప్రోలో 2,44,707 మంది ఉద్యోగులు ఉన్నారు.

(The above story first appeared on LatestLY on Nov 24, 2023 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).