Migrant Boat Capsizes off Yemen: ఘోర విషాదం,యెమెన్‌ తీరంలో బోటు మునిగిపోయి 49 మంది మృతి, మరో 140 మంది గల్లంతు

యెమెన్‌ తీరంలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోమాలియా, ఇథియోపియా నుంచి వచ్చిన వలసదారుల పడవ తీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు

Migrant Boat Capsizes off Yemen: ఘోర విషాదం,యెమెన్‌ తీరంలో బోటు మునిగిపోయి 49 మంది మృతి, మరో 140 మంది గల్లంతు
Drown Representative Image

యెమెన్‌ తీరంలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోమాలియా, ఇథియోపియా నుంచి వచ్చిన వలసదారుల పడవ తీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, 31 మంది మహిళలు ఉన్నారు.పడవమునిగిన సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న యెమెన్‌ రెస్క్యూ టీమ్స్‌ 71 మందిని రక్షించాయి. పొట్టకూటి కోసం కువైట్‌ వెళ్ళి మాంసపు ముద్దలైన 41 మంది భారతీయులు, అగ్నిప్రమాదంలో గుర్తుపట్టే వీలులేకుండా సజీవదహనమై..

ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.సోమాలియా, ఇథియోపియాలకు చెందిన 260 మందితో ఇటీవల ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ సోమవారం యెమెన్‌ దక్షిణ తీరంలో బోల్తాపడిందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది.

 

(The above story first appeared on LatestLY on Jun 12, 2024 09:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).