Ayman al-Zawahiri: హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తలదన్నే కిల్లర్ ఆపరేషన్.. అల్- జవహరీ హత్యకు అమెరికా వేసిన టెక్నికల్ ప్లాన్.. లేజర్ తో టార్గెట్ ఫినిష్
Ayman Al-Zawahiri (photo credit- ANI)

Washington, August 2: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఆల్ ఖైదా అగ్రనాయకుడు అల్-జవహరీని అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లోని ఆయన రహస్య నివాసంలో మట్టుబెట్టినట్టు అమెరికా ప్రకటించింది. అయితే, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా ఈ ఆపరేషన్ ఎంతో చాకచక్యంగా జరుగడం ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

కాబూల్ లోని ఓ రహస్య ప్రాంతంలో జవహరీ ఉన్నాడన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పెంటగాన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. గంటల వ్యవధిలోనే ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇంతలో ఆదివారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) జవహరీ ఇంటి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు. క్షణాల వ్యవధిలో జవహరీ లక్ష్యంగా డ్రోన్ల సాయంతో రెండు హెల్ ఫైర్స్ క్షిపణులను అమెరికా సైన్యం సంధించింది. బ్లేడ్ల వంటి పదునైన ఆరు లేజర్లు జవహరీ శరీరంలోకి చొచ్చుకుపోయాయి. లేజర్ కిరణాల తీవ్రతకు బాల్కనీ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే, ఇంట్లోనే ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ఏమీ కాలేదు. ఎలాంటి పేలుడూ జరుగలేదు. సెకండ్ల వ్యవధిలో ఆపరేషన్ సక్సెస్ అయింది. 2017లో అల్-ఖైదా సీనియర్ లీడర్ అబూ-అల్-ఖైర్ అల్-మస్రీని హతమార్చేందుకు కూడా ఇదే టెక్నాలజీని వినియోగించారు.

న్యూయార్క్ ను వణికిస్తున్న మంకీ పాక్స్, 1100కు చేరువలో మంకీపాక్స్ కేసులు, గజగజ వణకుతున్న అమెరికా ప్రజలు..

2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిపిన దాడులకు మూల సూత్రదారుల్లో జవహరీ ఒకరు. అమెరికా దళాలు 2011లో లాడెన్ ను హతమార్చిన తర్వాత అల్-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. అతనిపై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ఇదివరకే ప్రకటించింది.