Population Crisis in China: బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకుని పిల్లల్ని కనండి.. యువతీ యువకులను వేడుకుంటున్న చైనా.. ఎందుకంటే?

‘బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్‌ అవ్వండి’ అంటూ యువతీ యువకులను చైనా ప్రభుత్వం వేడుకుంటున్నది.

Population Crisis in China: బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకుని పిల్లల్ని కనండి.. యువతీ యువకులను వేడుకుంటున్న చైనా.. ఎందుకంటే?
Population(Photo-ANI)

Newdelhi, Sep 14: ‘బాబ్బాబు.. త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్‌ అవ్వండి’ అంటూ యువతీ యువకులను చైనా ప్రభుత్వం వేడుకుంటున్నది. యుక్త వయసులోనే యువతీ యువకులకు వివాహాలు (Marriages) చేయించేందుకు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) (NHC) ప్రయత్నాలను ముమ్మరం చేసింది కూడా. అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును క్రమంగా పెంచుకుంటూ పోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. రిటైర్మెంట్‌ వయసును పురుషులకు 60 నుంచి 63కు, మహిళలకు 50 నుంచి 55కు ఆయా ఉద్యోగాలను బట్టి పెంచాలని యోచిస్తున్నది.

దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్‌ లు ఫుల్

ఎందుకంటే?

దేశంలో తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్య కారణంగానే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. ప్రస్తుతం చైనాలోని నిబంధనలు ప్రకారం యువకులు 22 ఏండ్లు నిండిన తర్వాత, యువతులు 20 ఏండ్ల తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి. అయితే పిల్లల పెంపకానికి అధిక ఖర్చు కావడం, కెరీర్‌ కు సంబంధించిన లక్ష్యాలు, కొన్ని సంప్రదాయ కట్టుబాట్ల కారణంగా చాలామంది మహిళలు పిల్లలను కనడానికి సందేహిస్తున్నారు. దీంతో ఈ సమస్య ఉత్పన్నమైంది.

సైబ‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, సైబ‌ర్స్ ట‌వ‌ర్స్ నుంచి వెళ్లే వారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

(The above story first appeared on LatestLY on Sep 14, 2024 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).