Colorado Shooting: మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా, రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి, పుట్టినరోజు వేడుకల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు

అమెరికా మరోసారి కాల్పులు మోతతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి (Colorado Shooting) చెందారు. స్థానికంగా ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడో పార్క్‌లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు (Colorado Birthday Party Shooting) తెగపడ్డాడు.

Colorado Shooting: మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా, రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి, పుట్టినరోజు వేడుకల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు
Representational image (Photo credits: ANI)

Colorado, May 10: అమెరికా మరోసారి కాల్పులు మోతతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి (Colorado Shooting) చెందారు. స్థానికంగా ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడో పార్క్‌లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు (Colorado Birthday Party Shooting) తెగపడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఆ కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా గన్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం తనను తాను కాల్చుకొని మృతి చెందినట్లు తెలిపారు. అదేవిధంగా ఉడ్‌ల్యాండ్‌లో ఓ దుండగుడు ఇరుగుపొరుగువారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు కాల్పులు జరిగిన ఓ ఇంటికి నిప్పంటించినట్లు పేర్కొన్నారు. దీంతో స్థానికులు ఆ దుండగుడిపై ఎదురుకాల్పులు జరపడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే కాల్పులకు గల కారణాలేమిటో తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో పిల్లలు ఉన్నట్లు సమాచారం.

(The above story first appeared on LatestLY on May 10, 2021 11:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).