Ruby Slippers: 85 ఏండ్ల కిందటి ఆ చెప్పుల ఖరీదు రూ.237 కోట్లు.. కెంపులు పొదిగిన ఈ పాదరక్షలు ఎవరివంటే?

ఆ చెప్పులు 85 ఏండ్ల కిందటివి. రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురయ్యాయి. ఇప్పుడు ఈ పాదరక్షలు శనివారం జరిగిన ఆన్‌ లైన్‌ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్‌ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి.

Ruby Slippers: 85 ఏండ్ల కిందటి ఆ చెప్పుల ఖరీదు రూ.237 కోట్లు.. కెంపులు పొదిగిన ఈ పాదరక్షలు ఎవరివంటే?
Ruby Slippers (Credits: X)

Newdelhi, Dec 9: ఆ చెప్పులు (Slippers) 85 ఏండ్ల కిందటివి. రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురయ్యాయి. ఇప్పుడు ఈ పాదరక్షలు శనివారం జరిగిన ఆన్‌ లైన్‌ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్‌ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి. ఈ చెప్పులు కెంపులు (Ruby Slippers) పొదిగినవి మరి. 1939లో విడుదలై ఘన విజయం సాధించిన ది విజార్డ్‌ ఆఫ్‌ ఓజ్‌ అనే అమెరికన్‌ చిత్రంలో ఈ పాదరక్షలను జూడీ గార్లాండ్‌ ధరించి నటించారు.

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం 

అలా మ్యూజియంలోకి..

1969లో గార్లాండ్‌ మరణించగా తదనంతర కాలంలో ఈ విలువైన పాదరక్షలను ఆమె సొంత ఊరు గ్రాండ్‌ రాపిడ్స్‌ పట్టణంలోని జూడీ గార్లాండ్‌ మ్యూజియంలో భద్రపరిచారు. అయితే 2005లో టెర్నీ జాన్‌ మార్టిన్‌ అనే వ్యక్తి వాటిని తస్కరించాడు. 2018లో మార్టిన్‌ నుంచి ఈ చెప్పులను ఎఫ్‌ బీఐ స్వాధీనం చేసుకుంది. తాజాగా వీటిని వేలం వేశారు.

రీల్స్ పిచ్చితో ఒకే బైక్‌ పై ఏడుగురు ప్రయాణం... కఠిన చర్యలకు నెటిజన్ల డిమాండ్ (వీడియో)

(The above story first appeared on LatestLY on Dec 09, 2024 11:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).