Gorillas Test Positive for Covid: తొలిసారిగా గొరిల్లాలకు కరోనావైరస్, అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులో ఎనిమిది గొరిల్లాలకి కోవిడ్, వెల్లడించిన జూ అధికారులు
ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొరిల్లాలకి కరోనా వైరస్ సోకింది. అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులోని ఎనిమిది గొరిల్లాలకి కోవిడ్ (Gorillas Test Positive for Covid) సోకినట్టుగా పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిసా పీటర్సన్ సోమవారం వెల్లడించారు. కరోనా ( Coronavirus) సోకిన వాటిలో కొన్ని గొరిల్లాలు బాగా దగ్గుతున్నాయని చెప్పారు. కాగా పార్కులోని జంతు సంరక్షణ బృందంలోని ఒక వ్యక్తి నుంచి వైరస్ గొరిల్లాలకి సంక్రమించి ఉంటుందని పీటర్సన్ అనుమానం వ్యక్తం చేశారు.
San Diego (US), Jan 13: ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొరిల్లాలకి కరోనా వైరస్ సోకింది. అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులోని ఎనిమిది గొరిల్లాలకి కోవిడ్ (Gorillas Test Positive for Covid) సోకినట్టుగా పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిసా పీటర్సన్ సోమవారం వెల్లడించారు. కరోనా ( Coronavirus) సోకిన వాటిలో కొన్ని గొరిల్లాలు బాగా దగ్గుతున్నాయని చెప్పారు. కాగా పార్కులోని జంతు సంరక్షణ బృందంలోని ఒక వ్యక్తి నుంచి వైరస్ గొరిల్లాలకి సంక్రమించి ఉంటుందని పీటర్సన్ అనుమానం వ్యక్తం చేశారు.
కాగా ఇటీవల ఒక ఉద్యోగికి కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయిందని, గొరిల్లాల దగ్గరకి వెళ్లినప్పుడు అతను ఎల్లప్పుడూ మాస్కు ధరించేవాడని చెప్పారు. గత బుధవారం నుంచి గొరిల్లాలు కాస్త నలతగా కనిపిస్తూ దగ్గుతూ ఉండడంతో ఒక గొరిల్లాకి పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వాటికి కూడా కరోనా సోకినట్టుగానే భావిస్తున్నట్టు జంతు ప్రదర్శన శాల అధికార ప్రతినిధి ఆండ్రూ జేమ్స్ చెప్పారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని కరోనా కట్టడికి లాక్‌డౌన్ చర్యల్లో భాగంగా డిసెంబర్ 6 నుంచి ఈ జూని మూసే ఉంచారు. గొరిల్లాలలో కరోనా లక్షణాలు బయటపడిన దగ్గర్నుంచి వాటికి ప్రత్యేకంగా ఆహారం ఇస్తున్నారు. విటమిన్లు, ఫ్లూయిడ్స్ అధికంగా అందిస్తున్నారు. వాటి దగ్గరకి వెళ్లినప్పడు సిబ్బంది అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కుతో పాటు ఫేస్‌షీల్డ్, కళ్లద్దాలు పెట్టుకొని వెళుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ గొరిల్లాలలో మూడు అంతరించే జాతిలో చేరాయి. దీంతో జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. గత 20 ఏళ్లలో ఈ గొరిల్లాల సంఖ్య 60శాతానిపైగా పడిపోయింది. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు దగ్గర్నుంచి అటవీ జంతువులు పులులు, సింహాలకు కరోనా సోకింది. గొరిల్లాలకు కరోనా సోకడం ఇదే ప్రథమంగా చెప్పవచ్చు.
(The above story first appeared on LatestLY on Jan 13, 2021 09:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

