Uber Driver Attacked: రూట్‌ మార్చినందుకు ఉబెర్ డ్రైవర్‌ను చితకబాదిన ప్యాసింజర్, కెనడాలో భారతీయుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి, తీవ్రగాయాల పాలైన డ్రైవర్ (వీడియో)

కెనడాలో ఉబెర్‌ డ్రైవర్‌పై (Attack on Uber Driver) దారుణంగా దాడిచేశాడు ఓ వ్యక్తి. కారును వేరే రూట్‌లో తీసుకెళ్లినందుకు భారత్‌కు చెందిన అమన్ సూద్ అనే ఉబెర్ డ్రైవర్‌పై దాడికి దిగాడు. గతనెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్‌పై దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్యాసింజర్ దాడిలో అమన్ సూద్ తీవ్రంగా గాయపడ్డాడు.

Uber Driver Attacked: రూట్‌ మార్చినందుకు ఉబెర్ డ్రైవర్‌ను చితకబాదిన ప్యాసింజర్, కెనడాలో భారతీయుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి, తీవ్రగాయాల పాలైన డ్రైవర్ (వీడియో)
Uber (PIC@ Twitter)

Canada, May 03: కెనడాలో ఉబెర్‌ డ్రైవర్‌పై (Attack on Uber Driver) దారుణంగా దాడిచేశాడు ఓ వ్యక్తి. కారును వేరే రూట్‌లో తీసుకెళ్లినందుకు భారత్‌కు చెందిన అమన్ సూద్ అనే ఉబెర్ డ్రైవర్‌పై దాడికి దిగాడు. గతనెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్‌పై దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్యాసింజర్ దాడిలో అమన్ సూద్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులకు అమన్ ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకునే లోపే అతను పారిపోయాడు. దీంతో కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డయిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఉబెర్ బుక్ చేసుకున్న వ్యక్తిని డ్రైవర్ అమన్ సూద్‌ (Aman sood) వేరే రూట్‌లో వెళ్దామంటూ కోరాడు. తనకు ఆలస్యం అవుతుందని, నీలాంటి వ్యక్తితో మాట్లాడను అంటూ అసభ్యపదజాలంలో విరుచుకుపడ్డాడు ప్యాసింజర్. అంతేకాదు అతనితో వాగ్వాదానికి దిగాడు. అయితే కారుదిగి వెళ్లిపోవాలంటూ అమన్ సూద్...ఆ ప్యాసింజర్‌ ను కోరాడు. అప్పటికే డ్రైవర్‌ పై ప్యాసింజర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలయ్యాడు అమన్.

(The above story first appeared on LatestLY on May 03, 2023 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).