Mali Bus Accident: ఆఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ నిర్లక్ష్యంతో వంతెన పైనుంచి లోయలో పడ్డ బస్సు, 31 మంది మృతి
ఆఫ్రికా దేశం మాలిలో (Mali Bus Accident) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నది వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ ఘటన కెవిబాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
Mali, FEB 28: ఆఫ్రికా దేశం మాలిలో (Mali Bus Accident) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నది వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ ఘటన కెవిబాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
#BREAKING Thirty-one people dead in Mali after bus plunges off bridge: minister pic.twitter.com/0LIATrGqBL
— AFP News Agency (@AFP) February 27, 2024
బస్సు బుర్కినా ఫాసో వెళ్తోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల క్రితంకూడా మాలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 15మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.
(The above story first appeared on LatestLY on Feb 28, 2024 09:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

