Insurance Fraud: ఇన్సురెన్స్ డబ్బుల కోసం కాళ్లు నరుక్కున్న వ్యక్తి, కోర్టులో విషయం బయటపడటంతో బెడిసికొట్టిన ప్లాన్

డబ్బుల కోసం ప్రాణాలు తీసేవాళ్లను చూశాం…మోసాలు చేసేవాళ్లను చూశాం..కానీ హంగేరీకి చెందిన ఓ వ్యక్తి ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. సుమారు 14 బీమా పాలసీలను తీసుకున్న ఆ వ్యక్తి, వాటిని క్లైయిమ్ చేసుకునేందుకు ఈ పనికి పాల్పడ్డాడు.

Insurance Fraud: ఇన్సురెన్స్ డబ్బుల కోసం కాళ్లు నరుక్కున్న వ్యక్తి, కోర్టులో విషయం బయటపడటంతో బెడిసికొట్టిన ప్లాన్

Hungary November 12:  డబ్బుల కోసం ప్రాణాలు తీసేవాళ్లను చూశాం…మోసాలు చేసేవాళ్లను చూశాం..కానీ హంగేరీకి చెందిన ఓ వ్యక్తి ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. సుమారు 14 బీమా పాలసీలను తీసుకున్న ఆ వ్యక్తి, వాటిని క్లైయిమ్ చేసుకునేందుకు ఈ పనికి పాల్పడ్డాడు.

ఇన్సురెన్స్ చేసిన రూ.23కోట్ల డబ్బు కోసం పక్కా పథకం ప్రకారం ఈ పనికి పూనుకున్నాడు 54ఏళ్ల సెందర్ అనే వ్యక్తి. హంగేరీకి చెందిన సెందర్‌ అనే వ్యక్తి ఇన్సురెన్స్‌ కింద లభించే 23 కోట్ల 97 లక్షల రూపాయల కోసం రైలు ట్రాక్‌పై పడుకుని రెండు కాళ్లు నరుక్కున్నాడు. 2014లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో సెందర్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలను వాడుతూ వీల్‌చైర్ సపోర్టుతో బతుకువెళ్లదీస్తున్నాడు. కాళ్లు కోల్పోయిన తర్వాత బీమా డబ్బు కోసం సెందర్ బీమా కంపెనీలను సంప్రదించాడు. కానీ అతని ఎత్తుగడ బీమా సంస్థలు పసిగట్టి అతనికి ఊహించని షాక్‌ ఇచ్చాయి.

తన కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు, 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. దీంతో బీమా కంపెనీలకు అనుమానం వచ్చి, క్లెయిమ్‌ను ఆలస్యం చేశాయి. దీనితో మనస్థాపం చెందిన సెండర్‌ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో విషమంతా బట్టబయలయ్యింది.

బీమా పాలసీలపై వచ్చే డబ్బుల కోసమే తాను ఈ పని చేసినట్లు సెందర్‌ కోర్టులో ఒప్పుకున్నాడు. గ్లాస్‌పై జారిపడి, అదుపు తప్పి రైలు ట్రాక్‌పై పడిపోయినట్లు, ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు తెగిపోయాయని అందరి ముందూ నమ్మబలికి, బీమా డబ్బు మొత్తాన్ని పొందడానికి ప్లాన్‌ వేసినట్లు కోర్టు ముందు చెప్పుకొచ్చాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఇన్సురెన్సు డబ్బు కోసమే రైలు ముందు పడుకున్నాడని ఏడేళ్ల విచారణలో రుజువు కావడంతో కోర్టు ఈ కేసుపై తీర్పు వెలువరించింది. అతని మోసం బయటపడటంతో బీమా సొమ్ము దక్కలేదు సరికదా పరువు కూడా పోయింది.

(The above story first appeared on LatestLY on Nov 12, 2021 06:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).