Modi Says Sorry: మోడీ నోట సారీ మాట, ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియో, యూఎస్ సెనెటర్ కార్నిన్‌తో ఆసక్తికర సంభాషణ, సెనెటర్ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఈ రోజు మీ పుట్టినరోజు.. కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజు మీ భర్త నాతో ఉండాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించండి. ఇది మీకు ద్వేషాన్ని కలిగించవచ్చు
Houston,Septemeber 23: అగ్రరాజ్యం అమెరికాలో మోడీ పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత (Shared dreams Bright futures) పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన హౌడీ మోడీ (Howdy Modi)అనుకున్నదానికంటే ఘనంగా విజయవంతమైంది. ఈ ఈవెంట్ ఆది నుంచి మోడీ నినాదాలతో మార్మోగిపోయింది. హౌడీ మోడీ ఈవెంట్ ద్వారా ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింతగా బలపడింది. ఈ ఈవెంట్లోనే మోడీ సారీ అనే పదాన్ని వాడారు. అయితే అది సరదా సంభాషణలో మాత్రమే.. హూస్టన్ లో ప్రధాని మోడీ గౌరవార్థం జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది యుఎస్ ఎంపీలు, గవర్నర్లు హాజరయ్యారు. వీరిలో జాన్ కార్నిన్ అనే సెనేటర్ కూడా ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైనందున ఆయన తన భార్య శాండీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయారు. మోడీ చేతిని ముద్దాడిన కాశ్మీరీ పండిట్, అగ్రరాజ్యంలో నరేంద్రుడికి ఘనస్వాగతం
ఈ సందర్భంగా సెనెటర్ భార్యకు మోడీ క్షమాపణలు చెప్పారు. దీనికి కారణం ఆదివారం కార్నిన్ భార్య పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో మోదీ కార్నిన్ భార్యను ఉద్దేశిస్తూ.. ‘నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఈ రోజు మీ పుట్టినరోజు.. కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజు మీ భర్త నాతో ఉండాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించండి. ఇది మీకు ద్వేషాన్ని కలిగించవచ్చు’ అన్నారు. ఆ సందర్భంలో మోడీ పక్కనే జాన్ కూడా ఉన్నారు. వారిద్దరి జీవితాలు సంతోషంగా సాగాలని.. కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. వీడియో తాలూకు ట్వీట్ ను ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
మోడీతో సెనేటర్
Here is what happened when PM @narendramodi met Senator @JohnCornyn. pic.twitter.com/O9S1j0l7f1
— PMO India (@PMOIndia) September 23, 2019
ఈ వీడియో ఇప్పుడు ట్విటర్‌లో తెగ ట్రెండ్ అవుతుంది.ఈ పోస్టుకు 13వేలకు పైగా లైక్స్, 2000కు పైగా రీట్వీట్లు వచ్చిపడ్డాయి. జాన్ కార్నిన్ దంపతులది 40 ఏళ్ళ వైవాహిక జీవితం. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉగ్రవాదంపై ఇమ్రాన్ ఖాన్‌కి దిమ్మతిరిగే కౌంటర్. ట్రంప్ మన వాడే అన్న నరేంద్రుడు
ఐదు కుటుంబాలను భారత్‌కు పంపండి: మోదీ
కార్యక్రమానికి హాజరైన భారతీయులను ఉద్దేశిస్తూ మోడీ ‘ఈ వేదిక మీదుగా నేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల్ని ఓ చిన్న కోరిక కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు.. ఆయ దేశాలకు చెందిన ఐదు కుటుంబాలను ఇండియా పర్యటనకు పంపండి’ అని కోరారు. పగతో రగులుతోన్న PAK,జీహద్ కోసం కాశ్మీరుకు వెళ్లొద్దంటున్న ఇమ్రాన్ ఖాన్
పరిశుభ్రత అంశం అమెరికాలో..
ఇదిలా ఉంటే పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో మరోమారు చాటిచెప్పారు. హ్యూస్టన్‌లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చిన్న సంఘటన అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో అమెరికా ప్రతినిధి ఒకరు ప్రధాని మోదీకి పుష్పగుచ్చం అందించగా.. అందులోంచి కొన్ని పూలు కిందపడిపోయాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ మోదీ కిందికి వంగి స్వయంగా ఆ పూలను తీసి సిబ్బందికి అందించారు. ఈ అంశం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది.
(The above story first appeared on LatestLY on Sep 23, 2019 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

