Pakistan: నా భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా..కోపంతో భార్య లవర్ ముక్కు చెవులు కోసేసిన భర్త, బాధితుని పరిస్థితి విషమం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాకిస్తాన్ ముజఫర్‌ఘర్ గ్రామంలో ఘటన
దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ముక్కు చెవులను (Husband Chops Off Nose, Ears Of Wife's Lover) భర్త కోసేశాడు.
Muzffarghar, July 25: దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ముక్కు చెవులను (Husband Chops Off Nose, Ears Of Wife's Lover) భర్త కోసేశాడు. కాగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. పైగా ఆమె ప్రియుడికి కూడా వార్నింగ్ ఇచ్చాడు.అయినా ఇద్దరూ మారలేదు. దీంతో తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై ఆ భర్త కోపం పెంచుకున్నాడు. అతడిపై దాడి చేసి చెవు, ముక్కు కోసి వేశాడు. ప్రస్తుతం ఆ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పాకిస్తాన్ లోని లాహోర్ నుండి 375 కిలోమీటర్ల దూరంలో ఉన్నముజఫర్‌ఘర్ (Muzffarghar ) గ్రామంలో ఈ సంఘటన గురువారం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ముజఫరానగర్‌కు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే ఇతడి భార్యకు మహ్మద్ అక్రమ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యతో దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినా వారిద్దరూ మాట వినలేదు. సంబంధం కొనసాగిస్తుండడంతో ఖయ్యూమ్ కత్తి తీసుకుని సహచరులతో అక్రమ్ వెంట పడ్డాడు.
నిర్జన ప్రదేశానికి అతనిని తీసుకెళ్ళాడు. అక్కడ కత్తితో అక్రమ్ ముక్కు, చెవులు, కోసేశాడు. తీవ్ర గాయాలపాలైన అక్రమ్ వెంటనే ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించిన వైద్యులు ఏం జరిగిందని వివరాలు ఆరా తీయగా పై విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తన నేరాన్ని అంగీకరించిన ఖయ్యూమ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. కాగా పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం "honour killing" పేరిట 1,000 మంది మహిళలు మరియు దాదాపు 600 నుండి 800 మంది పురుషులు చంపబడుతున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 25, 2021 02:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

