New Covid-19 variant EG.5: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, చుక్కలు చూపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఈజీ.5

అమెరికా (America)లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఈజీ. 5 ఇప్పుడు కలకలం రేపుతోంది.ఈ వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్‌ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.

New Covid-19 variant EG.5: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, చుక్కలు చూపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఈజీ.5
Representational (Credits: Twitter/ANI)

US, August 10: అమెరికా (America)లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఈజీ. 5 ఇప్పుడు కలకలం రేపుతోంది.ఈ వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్‌ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్‌ ఒమిక్రాన్ జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్‌ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

కొత్త కరోనా వేరియంట్ ఎరిస్ లక్షణాలు ఇవే, ముక్కు కారడంతో పాటుగా 5 లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని నిపుణులు సూచన

ఈజీ.5 కాకుండా ఎరిస్‌ (Eric) లేదా ఈజీ.5.1 (EG.5.1) అని పిలవబడే మరో కొత్త వేరియంట్‌ కూడా ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోంది. కొవిడ్-19 (Covid-19)లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 (EG.5.1) ప్రస్తుతం బ్రిటన్ (UK)ని వణికిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఆ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందన్నారు.

మానవాళిపై డిసీజ్ ఎక్స్ రూపంలో మరో ప్రమాదకర వైరస్ పంజా, వ్యాక్సిన్ తయారు చేసే పనిలో బిజీ అయిన 200 మందికి పైగా శాస్త్రవేత్తల బృందం

ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్‌ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. సాధారణంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్‌ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Aug 10, 2023 09:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).