Crimea Bridge Blast: క్రిమియా బ్రిడ్జిని పేల్చేందుకు 23టన్నుల పేలుడు పదార్ధాలు, భారీగా ప్లాన్ చేసిన నిందితులు, దర్యాప్తును వేగవంతం చేసిన రష్యా, ఇప్పటి వరకు 8మంది అరెస్ట్, పేలుడు కుట్ర వెనుక ఉన్నదెవరంటే?

కెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో ఉక్రెయిన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది.

Crimea Bridge Blast: క్రిమియా బ్రిడ్జిని పేల్చేందుకు 23టన్నుల పేలుడు పదార్ధాలు, భారీగా ప్లాన్ చేసిన నిందితులు, దర్యాప్తును వేగవంతం చేసిన రష్యా, ఇప్పటి వరకు 8మంది అరెస్ట్, పేలుడు కుట్ర వెనుక ఉన్నదెవరంటే?
Cerdit @ Twitter

Russia, OCT 13: రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య (Russia -Ukrain) యుద్ధవాతావరణం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇటీవల రష్యా, క్రిమియాను కలిపే కెర్చ్ బ్రిడ్జి పేల్చివేత ఘటనతో (Crimea bridge blast) యుక్రెయిన్ పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. రష్యా సైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులతో యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. స్థానిక ప్రజలు ప్రాణాలుసైతం కోల్పోతున్నారు. అయితే, కెర్చ్ వంతెన పేల్చివేతను (Crimea bridge blast) సీరియస్‍గా తీసుకున్న పుతిన్ అందుకుకారకులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. కెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో ఉక్రెయిన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది.

Astronaut Scam: అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. కిందకు వచ్చేందుకు రాకెట్ కావాలంటూ రూ.25లక్షలు వసూలు, టికెట్‌కు కూడా డబ్బు లేదంటూ వృద్ధురాలికి వల, ప్రేమ పేరుతో 65 ఏళ్ల వృద్ధురాలి నుంచి డబ్బులు గుంజిన అజ్ఞాత వ్యక్తి, జపాన్‌లో వృద్ధురాలిని విచిత్రంగా మోసం చేసిన ఆగంతకుడు 

ఈ పేలుళ్ల వెనుక యుక్రెయిన్ హస్తం ఉందని రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్‌బీ (FSB) పేర్కొటుంది. యుక్రెయిన్ రక్షణశాఖకు చెందిన ప్రధాన ఇంటెలిజెన్స్ విభాగం ఈ దాడికి కుట్ర పన్నినట్లు ఎఫ్ఎస్‌బీ (FSB) వెల్లడించినట్లు రష్యా వార్తా సంస్థ పేర్కొంది. వంతెన పేల్చేందుకు 23 టన్నుల పేలుడు పదార్థాలను వినియోగించారని, దీనిని నిర్మాణాలకు వినియోగించే పాలీఇథలిన్ ఫిల్మ్ లో దాచిపెట్టి తరలించినట్లు రష్యా నిఘా సంస్థలు చెబుతున్నాయి.

Video Games Threat: మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్లే! వీడియో గేమ్స్ ఆడే పిల్లల గుండెకు ముప్పు, ప్రాణాపాయం ఉండే అవకాశముందని పరిశోధకుల హెచ్చరిక 

ఈ పేలుడు పదార్థాలు యుక్రెయిన్ రేవు పట్టణమైన ఒడెస్సా నుంచి ఆగస్టులోనే పంపించినట్లు, అవి బల్గారియా, జార్జియా, అర్మేనియాలు దాటుకొని ఇక్కడికి వచ్చినట్లు ఎఫ్ఎస్‌బీ పేర్కొటుంది.

(The above story first appeared on LatestLY on Oct 13, 2022 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).