Strait of Hormuz Crisis: ట్రంప్ దిగిపోయే దాకా యుద్ధం చేస్తాం.. హార్ముజ్ జలసంధిపై అమెరికా అడుగు పడనివ్వం.. ఇరాన్ నుంచి సంచలన ప్రకటన..

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ జలసంధిపై వాషింగ్టన్‌కు సంపూర్ణ నియంత్రణ ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఇరాన్ అధికారులు ఖండించారు

Strait of Hormuz Crisis: ట్రంప్ దిగిపోయే దాకా యుద్ధం చేస్తాం.. హార్ముజ్ జలసంధిపై అమెరికా అడుగు పడనివ్వం.. ఇరాన్ నుంచి సంచలన ప్రకటన..
Iran's Supreme Leader Mojtaba Khamenei (File Photo: x/@Rahbarenghelab_) and US President Donald Trump (File Photo/Reuters)

Strait of Hormuz Crisis: ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ జలసంధిపై వాషింగ్టన్‌కు సంపూర్ణ నియంత్రణ ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఇరాన్ అధికారులు ఖండించారు. జలసంధి ఇప్పటికీ తమ దిగ్బంధంలోనే ఉందని.. తమ షరతులను అంగీకరించే వరకు దానిని తిరిగి తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేస్తూ.. హార్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉంది. దానిని మేమే నిలుపుకుంటామని అనుకుంటున్నానని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ పర్షియన్ స్ట్రెయిట్ గల్ఫ్ అథారిటీ 'X' (ట్విట్టర్) వేదికగా ఈ వ్యాఖ్యలను తప్పుపట్టింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధంలో లేదనడం వాస్తవాన్ని మార్చలేదని.. ఇరాన్ డిమాండ్లను అమెరికా అంగీకరించే వరకు రాకపోకలను అనుమతించబోమని తేల్చి చెప్పింది.

ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా విదేశీ వీసాలు రద్దు.. కారణం ఏంటంటే..

ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాణిజ్యం తీవ్రంగా దెబ్బతిన్నది.   ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు ఈ జలసంధి గుండా రోజుకు సగటున 130 చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు ప్రయాణించేవి. కానీ, ప్రస్తుతం 5-రోజుల సగటు ఆధారంగా రోజుకు కేవలం 13 నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. దీంతో నౌకల రాకపోకలు గత మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడమే కాకుండా, సాధారణ స్థాయి కంటే 90 శాతం క్షీణించాయి.

ఇరాన్ కఠిన షరతులు:

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి అమెరికా ముందు భారీ డిమాండ్లను ఉంచింది.

1. అమెరికా తక్షణమే నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి.

2. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా సడలించాలి.

3. ఈ ప్రాంతం నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి.

4. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం (యుద్ధ పరిహారం) చెల్లించాలి.

అమెరికా సైన్యంపై ఇరాన్ కమాండర్ విమర్శలు:

మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ ఉన్నత సలహాదారు మొహమ్మద్ రెజా నఖ్ది అమెరికా వ్యూహాన్ని తీవ్రంగా విమర్శించారు. అమెరికా సైన్యం వారు అనుకున్నదానికంటే చాలా బలహీనంగా ఉందని, యుద్ధంలో వారికి స్పష్టమైన లక్ష్యాలు లేక గందరగోళంలో పడ్డారని వ్యాఖ్యానించారు. ఖార్గ్ ద్వీపాన్ని ఆక్రమించడం నుండి జలసంధిని తెరవడం వరకు ప్రతి రెండు మూడు రోజులకు అమెరికా తన లక్ష్యాలను మారుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

అమెరికాతో సాగుతున్న సైనిక ఘర్షణను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం ముగించుకుని వైదొలిగేంత వరకు ఉద్దేశపూర్వకంగా పొడిగించే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ సీనియర్ సలహాదారు మహమ్మద్ రెజా నఖ్దీ వెల్లడించారు. శత్రు దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు పంపడమే కాకుండా, భవిష్యత్తులో ఎవరైనా ఇరాన్‌పై దాడి చేయాలనే ఆలోచన రావడానికే భయపడేలా నిరోధక శక్తిని (Deterrence) నిర్మించడమే తమ ప్రధాన వ్యూహమని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో తామే ఆధిక్యంలో ఉన్నామని, అయితే ఇరాన్ నిర్దేశించుకున్న అంతిమ భద్రతా లక్ష్యాలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని ఆయన అన్నారు. ఈ ఘర్షణల వల్ల అమెరికా సైన్యంతో నేరుగా పోరాడే వ్యూహాత్మక అనుభవం తమ బలగాలకు లభిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ సాంకేతికంగా తమ క్షిపణి నిల్వలు ముగిసిపోయే పరిస్థితి వస్తే, ఇరాన్ అమెరికాకు మరింత ప్రమాదకరంగా మారుతుందని నఖ్దీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా వద్ద క్షిపణులు లేనప్పుడు మేము అమెరికాకు ఇంకా పెద్ద ముప్పుగా మారతాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు చెందిన వేలాది ఆర్థిక ప్రయోజనాలు, మౌలిక వసతులు వ్యాపించి ఉన్నాయి. వాటన్నింటినీ సులభంగా నాశనం చేసే వ్యూహాలు మా వద్ద ఉన్నాయని హెచ్చరించారు. అయితే ఆ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి, వాటిపై ఏ విధంగా దాడులు నిర్వహిస్తారనే వివరాలను ఆయన బహిర్గతం చేయలేదు.

ఈ పోరాటంలో ఇరాన్ నిరోధక శక్తిని (Deterrence) సాధించడమే తమ ప్రధాన ధ్యేయమని నఖ్దీ స్పష్టం చేశారు. యుద్ధాన్ని సుదీర్ఘకాలం పొడిగించడం ద్వారా అమెరికాను క్షీణింపజేసి, భవిష్యత్తులో ఇరాన్‌పై దాడి చేయాలంటే ఏ దేశమైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే భయాన్ని కల్పించడమే తమ ప్రణాళిక అని ఆయన వెల్లడించారు. ఇరు దేశాలు నష్టపరిహారంతో సహా తమ డిమాండ్లపై మొండిగా ఉండటంతో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళన నెలకొంది.

(The above story first appeared on LatestLY on Aug 13, 2026 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).