Elon Musk Secret Child: పిల్ల‌ల్ని క‌న‌డంలోనూ రికార్డు సృష్టించిన ఎలాన్ మ‌స్క్, ఏకంగా క్రికెట్ టీమ్ ను రెడీ చేశాడు, తాజాగా మూడో బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌స్క్ గ‌ర్ల్ ఫ్రెండ్

ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్, న్యూరాలింక్ (Neuralink)స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ పొందాడు (Elon Musk Secret Child). మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక క్రికెట్ టీమ్ తయారుచేశాడని అంటున్నారు.

Elon Musk Secret Child: పిల్ల‌ల్ని క‌న‌డంలోనూ రికార్డు సృష్టించిన ఎలాన్ మ‌స్క్, ఏకంగా క్రికెట్ టీమ్ ను రెడీ చేశాడు, తాజాగా మూడో బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌స్క్ గ‌ర్ల్ ఫ్రెండ్
Elon Musk, Shivon Zilis (Photo Credits: Wikimedia Commons, X/@shivon)

Washington, June 23: ప్రపంచ బిలియనీర్, స్పేస్ ఎక్స్, టెస్లా అధినేతగా పేరొందిన ఎలన్ మస్క్ (Elon Musk) వ్యాపారాల్లోనే కాదు.. వైవాహిక జీవితంలో పిల్లలను కనడంలో కూడా తనకు సాటిలేదనిపించుకున్నాడు. ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్, న్యూరాలింక్ (Neuralink)స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ పొందాడు (Elon Musk Secret Child). మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక క్రికెట్ టీమ్ తయారుచేశాడని అంటున్నారు.

Tech Layoffs 2024: ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు 

ప్రస్తుత రోజుల్లో ఒక బిడ్డను కనడమే కష్టం.. అలాంటిది మస్క్ మామ మాత్రం తన సంతానాన్ని పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు. జిలిస్‌తో మస్క్‌కు ఇది మూడో సంతానం. బిలియనీర్ 2021లో న్యూరాలింక్ () ఎగ్జిక్యూటివ్‌తో డేటింగ్ చేసి ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. కోర్టు పత్రాల ప్రకారం.. మస్క్ కవలల పేర్లను తమ తండ్రి చివరి పేరు, వారి మధ్య పేరులో వారి తల్లి చివరి పేరును కలిగి ఉండేలా మార్చాలని పిటిషన్ కూడా దాఖలు చేశాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. వాస్తవానికి, మస్క్‌కు మొత్తం ఎంత మంది పిల్లలు ఉన్నారనేది స్పష్టంగా తెలియలేదు. అయితే, ఆయనకు 11 మంది పిల్లలు ఉన్నారని పలు నివేదికలు వెల్లడించాయి.

Sexual Content on Instagram: మైనర్‌లకు సెక్స్ వీడియోలు చూపిస్తున్న ఇన్‌స్టాగ్రామ్, అకౌంట్ లాగిన్ చేసిన నిమిషాల్లోనే వీడియోలు డిస్ ప్లే 

అందులో ఆయన మొదటి భార్య, రచయిత జస్టిన్ మస్క్‌కు ఐదుగురు సంతానం జన్మించారు. ఈమెతో బ్రేకప్ అయిన తర్వాత మ్యూజిషియన్ గ్రిమ్స్‌తో డేటింగ్ చేసి మరో ముగ్గురికి మస్క్ జన్మినిచ్చారు. మస్క్ న్యూరాలింక్‌ను స్థాపించిన తర్వాత బ్రెయిన్-కంప్యూటర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే కంపెనీకి సహ-సీఈఓగా పనిచేస్తున్నారు. మస్క్ తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగినులతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అదే క్రమంలో మస్క్ స్పేస్‌ఎక్స్‌లోని మహిళా ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిన రెండు వారాల తర్వాత జిలిస్‌తో మరో బిడ్డ గురించి వార్తలు వచ్చాయి.

(The above story first appeared on LatestLY on Jun 23, 2024 06:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).