Joe Biden Stumbles Twice Video: విమానం ఎక్కుతూ తూలి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫిటినెస్‌, మతిమరుపుపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షుడి ప్రయాణానికి ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ బైడెన్ తూలిపడబోయాడు. మెట్లపై పడిపోయే ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే మరోసారి తూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

Joe Biden Stumbles Twice Video: విమానం ఎక్కుతూ తూలి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫిటినెస్‌, మతిమరుపుపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
US President Joe Biden stumbles twice while boarding Air Force One, netizens say 'this does not look good (Photo-AP)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షుడి ప్రయాణానికి ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ బైడెన్ తూలిపడబోయాడు. మెట్లపై పడిపోయే ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే మరోసారి తూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. విమానం ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు చాలా చిన్నగా ఉంటాయని, అలాంటి మెట్లు ఎక్కడానికీ బైడెన్ తడబడ్డారంటే ఆయన ఫిట్ నెస్ పై అనుమానాలు రావడం సహజమేనని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.

ఈ ఏడాది 82వ వసంతంలోకి అడుగుపెట్టనున్న బైడెన్..విదేశీ నేతల పేర్లతో పాటు తమ పార్టీ నేతల పేర్లనూ ఆయన మరచిపోతున్నారని, జ్ఞాపకశక్తి పూర్తిగా క్షీణించిందని రిపబ్లికన్ నేతలు ఆరోపిస్తున్నారు.

Here's Video

(The above story first appeared on LatestLY on Feb 22, 2024 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).