Vietnam Fire: భారీ అగ్నిప్రమాదం, వియత్నాంలో 9వ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు, మంటల్లో మాడి మసైన 50 మంది
వియత్నాంలోని హనోయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో గత రాత్రి చెలరేగిన మంటలు 50 మంది ప్రాణాలు బలిగొన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యలో మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు
- Read in
- తెలుగు
వియత్నాంలోని హనోయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో గత రాత్రి చెలరేగిన మంటలు 50 మంది ప్రాణాలు బలిగొన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యలో మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, అగ్నిప్రమాదం తర్వాత ఆసుపత్రికి తరలించిన 54 మంది మరణించినట్టు స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి.
ప్రమాదం సంభవించిన భవనంలో 45 కుటుంబాలు నివాసముంటున్నాయి. రాత్రి 11.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అందరూ ఇళ్లలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. భవనం ఇరుకు సందులో ఉండడంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగినట్టు వియత్నాం అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Here's News
JUST IN: "Dozens" killed in apartment building fire in Hanoi, Vietnam, according to state media pic.twitter.com/uv3NQA3L5S
— BNO News (@BNONews) September 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 13, 2023 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

