Woman Shoots Husband: ఇంటికి వస్తున్న చిన్నపిల్లలపై భర్త అత్యాచారం, పసిగట్టి తుఫాకీతో అతన్ని కాల్చి చంపేసిన భార్య, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

యూఎస్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని భార్య అతన్ని తుఫాకీతో కాల్చి (Woman in US shoots husband) పడేసింది. ఘటన వివరాల్లోకెళితే.. వాషింగ్టన్‌లో మాండరిన్

Woman Shoots Husband: ఇంటికి వస్తున్న చిన్నపిల్లలపై భర్త అత్యాచారం, పసిగట్టి తుఫాకీతో అతన్ని కాల్చి చంపేసిన భార్య, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
Image used for representation purpose only | Photo: PTI

యూఎస్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని భార్య అతన్ని తుఫాకీతో కాల్చి (Woman in US shoots husband) పడేసింది. ఘటన వివరాల్లోకెళితే.. వాషింగ్టన్‌లో మాండరిన్ ఓరియంటల్ హోటల్‌ ఉంటున్న ఒక జంట డేకేర్‌ సెంటర్‌ నడుపుతోంది. అయితే భర్త జేమ్స్ వీమ్స్ జూనియర్ చిన్నారులపై లైంగిక వేధింపులకు ( child molesting allegations) పాల్పడుతున్నట్లు అతడి భార్య శాంతేరీ వీమ్స్ గుర్తించింది. ముగ్గురు చిన్నారులపై దారుణైన అఘాయిత్యాలకు పాల్పడటంతో ఆమె సహించలేకపోయింది.

దీంతో ఆమె ఈ విషయమై అతడిని గట్టిగా నిలదీసింది. కొద్దిసేపు వారి మధ్య ఘర్షణతో కూడిన వాతావరణం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆమె అతడిన్ని తుపాకితో కాల్చి చంపింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పిల్లలను లైంగిక వేధించడని ఆరోపణలు చేస్తూ...అందువల్లే తన భర్తను (Woman in US shoots) చంపినట్లు తెలిపింది.

మసీదు వెనకకు తీసుకెళ్లి ఆరేళ్ల చిన్నారిపై ఇమాం అత్యాచారం, పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడు అరెస్ట్

వారు ఉన్న గదిలో పోలీసులకు దొరికిన ఒక డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ డ్రైరీలో..తన భర్త ముగ్గురి పిల్లల జీవితాలను నాశనం చేశాడని, పలువురి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు రాసి ఉందన్నారు పోలీసులు. అయితే ఇప్పుడు ఆ మహిళ తాను నేరం చేశానని అంగీకరించటం లేదు. దీంతో పోలీసులకు ఈ కేసు అత్యంత సవాలుతో కూడిన మిస్టరీగా ఉంది. ప్రస్తుతం ఈ విషయమై యూఎస్‌ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. సదరు నిందితురాలు ప్రాథమిక విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉందని కూడా చెప్పారు.

(The above story first appeared on LatestLY on Jul 29, 2022 02:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).