Huge Discounts on Vida V1 Pro: త్వరపడండి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.24 వేల వరకు డిస్కౌంట్, కేవలం రూ.499 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు

దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన విదా విద్యుత్‌ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రయోజనాలను అందిస్తోంది. విదా వీ1 ప్రో (Vida V1 Pro) మోడల్‌పై రూ.24 వేలు వరకు పలు రకాలుగా డిస్కౌంట్ (huge discounts on Vida V1 Pro electric scooter) ఇస్తోంది.

Huge Discounts on Vida V1 Pro: త్వరపడండి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.24 వేల వరకు డిస్కౌంట్, కేవలం రూ.499 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు
Hero MotoCorp Vida V1 Pro electric scooter (Photo-Bikedekho)

దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన విదా విద్యుత్‌ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రయోజనాలను అందిస్తోంది. విదా వీ1 ప్రో (Vida V1 Pro) మోడల్‌పై రూ.24 వేలు వరకు పలు రకాలుగా డిస్కౌంట్ (huge discounts on Vida V1 Pro electric scooter) ఇస్తోంది. ఇందులో రూ.2,500 వరకు నగదు ప్రయోజనంతో పాటు రూ.6,600 ఈఎంఐ బెనిఫిట్‌, బ్యాటరీ వారెంటీ పొడిగింపుపై 50 శాతం రాయితీ ఇస్తోంది.

అలాగే ఎక్స్ఛేంజ్‌ బోనస్‌పై రూ.2,500, హీరో కస్టమర్లకు లాయల్టీ బోనస్‌ కింద రూ.5 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్ కింద రూ.2500, రూ.1,125 విలువైన ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను అందిస్తున్నారు. పోర్టబుల్‌ ఛార్జర్‌, ఫేమ్‌-2 సబ్సిడీతో కలిపి ఢిల్లీలో ఈ స్కూటర్‌ ధర (Vida V1 Pro electric scooter Price) రూ.1.25 లక్షలుగా ఉండగా.. ఇతర ప్రాంతాల్లో రూ.1.45 లక్షలు ఉంది.

కారు కొనేవారికి షాకిచ్చిన టాటా మోటార్స్, ఫిబ్రవరి 1 నుంచి ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన ధరలపై 0.7శాతం వరకు పెంపు

హీరో విదా వీ1 ప్రో కొనుగోలుపై హీరో ఫిన్‌కార్ప్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఎకోఫై, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ సంస్థలు రుణాలను కూడా అందిస్తున్నాయి. మీరు ఈ స్కూటర్ ను 5.99 శాతం వడ్డీ రేటుతో కేవలం రూ.499 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు. దీనికి ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయడం లేదు.

విదా వీ1 ప్రో ఫీచర్లు: ఈ స్కూటర్‌ 110 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తోంది. టాప్‌ స్పీడ్‌ 80 కిలోమీటర్లు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో కేవలం 65 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీని ఛార్జ్‌ చేసుకోవచ్చు. వెనుక సీటును తొలగించుకునే సదుపాయం కూడా ఉంది. మీరు బ్యాటరీని సైతం తొలగించి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, 26 లీటర్ల బూట్‌ స్పేస్‌, ఎమర్జెన్సీ అలర్ట్‌ స్విచ్‌, బ్లూటూత్‌, వైఫై, 4జీ, నావిగేషన్‌, జియో ఫెన్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐదేళ్లు/ 50వేల కిలోమీటర్ల వెహికల్‌ వారెంటీ, 3ఏళ్లు/30వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో ఈ స్కూటర్‌ వస్తోంది.

(The above story first appeared on LatestLY on Jan 23, 2024 09:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).