టాటా మోటార్స్​ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్​ ధరలను పెంచనుంది. ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన (EV) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 0.7శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ ధర పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీ పంచ్, నెక్సాన్ హారియర్ వంటి అనేక రకాల ప్యాసింజర్ వెహికల్స్​ను విక్రయిస్తోంది. మారుతీ సహా పలు ఆటోమొబైల్​ కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)