LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టే అవకాశం ఉన్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో ఇదే అంశంపై పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతున్నది.

LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం
LIC (Credits: Pixabay)

Newdelhi, June 15: ఆరోగ్య బీమా రంగంలోకి (Health Insurance) ఎల్‌ఐసీ (LIC) అడుగుపెట్టే అవకాశం ఉన్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో ఇదే అంశంపై పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతున్నది. ఈ క్రమంలో ఎల్‌ఐసీ స్పందించింది. ‘ఆ రకమైన ప్రతిపాదనైతే ఇప్పటికైతే అధికారికంగా రాలేదు’ అని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లో ఎంట్రీపై ఎల్‌ఐసీ తేల్చిచెప్పింది. మీడియాలో వస్తున్న కథనాలు అధికరమైనవి కావని వెల్లడించింది.

రైలులో మంటలు అంటుకున్నాయని పుకార్లు షికార్లు.. భయంతో నడుస్తున్న రైలు నుంచి దూకిన పలువురు ప్రయాణికులు.. ఎదురుగా మరో ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు ప్రయాణికుల మృతి.. ఝార్ఖండ్‌ లో ఘోరం

పార్లమెంటరీ కమిటీ సూచనలతో..

ఒకే సంస్థ జీవిత, సాధారణ, ఆరోగ్య బీమాలను ఇచ్చేలా  లైసెన్స్‌ లు ఇవ్వాలని, ఆ మేరకు సంబంధిత చట్టాలను సవరించాలని పార్లమెంటరీ కమిటీ గత ఫిబ్రవరిలో కేంద్రానికి సూచించింది. దీనివల్ల దేశంలో బీమా అందరికీ చేరువవుతుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టే అవకాశం ఉన్నదని వార్తలు వచ్చాయి.

నారాయణపేట మర్డర్, పెద్దపల్లి అత్యాచార ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు, ఉట్కూరు ఎస్సై సస్పెండ్

ప్రస్తుత చట్టాలు ఏం చెప్తున్నాయి?

బీమా చట్టం 1938, ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఒకే సంస్థ.. లైఫ్‌, జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లను అమ్మరాదు. జీవిత బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను ఇవ్వరాదు. వాటిని జనరల్‌ ఇన్సూరెన్స్‌, స్టాండలోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలే ఇవ్వాలి. అందుకే ఆరోగ్య బీమా పాలసీలను జారీ చేసేందుకు ఎల్‌ఐసీకి అనుమతి లేదు.

ఇంత దారుణమా, అందరూ చూస్తుండగానే రైతును కర్రలతో కొట్టి చంపిన ప్రత్యర్థి వర్గం, వీడియో ఎంత భయంకరంగా ఉందో చూడండి

(The above story first appeared on LatestLY on Jun 15, 2024 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).