UPI Payments: UPI యూజర్లకు గుడ్‌న్యూస్.. రూ.2 వేల వరకు లావాదేవీలపై బ్యాంక్ ఛార్జీలు ఉండవని తెలిపిన కేంద్ర ప్రభుత్వం..

దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), రూపే (RuPay) డెబిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2,000 వరకు జరిపే చెల్లింపులపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను విధించకూడదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

UPI Payment Representational Image (Photo Credits: UPI)

UPI Payments: దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), రూపే (RuPay) డెబిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2,000 వరకు జరిపే చెల్లింపులపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను విధించకూడదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు 'చెల్లింపుల, పరిష్కార వ్యవస్థల చట్టం, 2007'లోని సెక్షన్ 10A కింద కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకులు లేదా డిజిటల్ సిస్టమ్ ప్రొవైడర్లు వినియోగదారులు లేదా వ్యాపారుల నుంచి రూపాయి కూడా రుసుముగా వసూలు చేయడానికి వీల్లేదు.

ఉబెర్‌లో మళ్లీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులపై వేటు వేసిన రైడ్-హెయిలింగ్ దిగ్గజం..

ఇటీవల పార్లమెంటు ఆమోదించిన 'పన్నుల, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026' ద్వారా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269SU కింద ఉన్న పాత మినహాయింపుల్లో మార్పులు చేశారు. ఈ మార్పుతో అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి రూ. 50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన దిగ్గజ వ్యాపార సంస్థల నుండి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రుసుమును వసూలు చేయడానికి మార్గం సుగమమైంది. అయితే ఈ నిబంధన సాధారణ వినియోగదారులపై భారం మోపడానికని జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ సుస్థిరత మరియు సాంకేతిక అభివృద్ధికే ఈ చర్యలని ప్రభుత్వం వివరించింది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ. 314 లక్షల కోట్ల విలువైన 24,000 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. వ్యాపారులకు జరిగే (P2M) చెల్లింపులలో 96 శాతం లావాదేవీలు రూ. 2,000 లోపే ఉంటుండటం గమనార్హం. మిగిలిన 4 శాతం అధిక విలువైన లావాదేవీలు మొత్తం చెల్లింపుల విలువలో మూడింట రెండు వంతులుగా ఉన్నాయి.

MDR లేకపోవడం వల్ల చెల్లింపుల పరిశ్రమ ఏటా రూ. 20,700 కోట్ల వ్యయాన్ని భరిస్తోందని, దీనిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక పథకాల ద్వారా చిన్న వ్యాపారుల చెల్లింపులకు సబ్సిడీ అందిస్తోంది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీ కేటాయింపులు రూ. 2,000 కోట్లుగా అంచనా వేయబడగా, భవిష్యత్తులో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన వ్యక్తి-నుండి-వ్యాపారి (P2M) యూపీఐ లావాదేవీలపై సుమారు 0.4% MDR విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement