Game Changer Release Date: గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లీక్ చేసిన దిల్ రాజు, దీపావళికి సినిమా విడుదల లేనట్లే...ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
జులై 26న విడుదల కానున్న 'రాయన్' సినిమా ప్రీ- రిలీజ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్ రాజు (Dill Raju) 'రాయన్' చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.
Hyderabad, July 21: రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమా విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయిందని డైరెక్టర్ శంకర్ (Shankar) తెలిపిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి సినిమా రాలేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'గేమ్ ఛేంజర్' (Game Changer) పేరుతో రెండేళ్లుగా ఊరిస్తూనే ఉన్న ఇప్పటి వరకు అధికారికంగా మూవీ రిలీజ్ పై స్పష్టత లేదు. అటు డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 (Indian 2) మూవీ ప్రమోషన్లలో ప్రకటిస్తాడు అనుకుంటే ఆయన కూడా రివీల్ చేయలేదు. జులై 26న విడుదల కానున్న 'రాయన్' సినిమా ప్రీ- రిలీజ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్ రాజు (Dill Raju) 'రాయన్' చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ఈ క్రమంలో 'గేమ్ ఛేంజర్' విడుదల ఎప్పుడు అంటూ చరణ్ ఫ్యాన్స్ పట్టుపట్టారు. దీంతో ఆయన చెప్పక తప్పలేదు. 'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్ రాజ్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. దిల్ రాజు చెప్పిన ప్రకారం డిసెంబర్ 25న గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. దీపావళికి విడుదలవుతుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.
Vishwambara Songs: విశ్వంభరపై కీరవాణి మార్క్..పాటలు అదిరిపోవాల్సిందంతే!
‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 15, 1558 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

