IIFA honours Chiranjeevi( Twitter)

Hyd, July 16: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలె కేంద్ర ప్రభుత్వ దేశ రెండో సర్వోన్నత పురస్కారంతో సత్కరించగా తాజాగా జరుగుతున్న ఐఫా అవార్డ్స్ 2024 కార్యక్రమంలో ఔట్ స్టాండింగ్‌ అచీవ్‌ మెంట్ ఇన్‌ ఇండియన్‌ సినిమా గౌరవాన్ని అందుకోనున్నారు.

టాలీవుడ్‌ లెజెండ్‌ నటులలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు...అనతికాలంలోనే అగ్రహీరోగా ఎదిగారు. డ్యాన్స్‌, డైలాగ్స్, మాస్ నటనతో మెగాస్టార్‌గా అంతకుమించి అన్నయ్యగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్దాంతాన్నే నమ్ముతారు. అందుకే కేవలం టాలీవుడ్‌లోనే కాదు భారతీయ సినీ పరిశ్రమలో అన్నయ్యని ఇష్టపడని వారుండరూ. నా సినీ జీవితంలో రూ. 1000 కోట్లు సినిమా ఇదే, కల్కి సినిమా ఘన విజయంపై అమితాబ్ బచ్చన్ వీడియో ఇదిగో, వేయి కోట్లు ప్ర‌భాస్‌కు నార్మ‌ల్ కావ‌చ్చు అంటూ..

 

ఆరు పదుల వయసు దాటిన ఇప్పటికి కుర్రహీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఒక విధంగా చెప్పాలంటే కుర్రహీరోలను తలదన్నే విధంగా డ్యాన్స్‌ చేస్తు మెప్పిస్తున్నారు చిరు. ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు చిరు. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనగవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. చిరు సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.